కృషి పట్టుదల ఉంటే మనుషులు సాధించలేనిది ఏమీ లేదని నిరూపించాడు ఒరిస్సాకు చెందిన జ్యోతి రాజన్ బాగర్తి (32). ఒరిస్సాలో నిరుపేద కుటుంబంలో జన్మించిన రాజన్ ఉన్నత చదువులు చదివి కూడా 14 సంవత్సరాలు పాటు కాగ్నిజెంట్ టెక్నాలజీస్ లో సూపర్ వైజర్ గా పనిచేశారు. అయితే ఉన్నత ఉద్యోగంలో స్థిరపడాలన్న పట్టుదలతో పది సంవత్సరాలక్రితం ఐఏఎస్ పరీక్ష రాసిన మొట్టమొదటసారి ఉత్తీర్ణీత సాధించలేకపోయాడు. కానీ పది సంవత్సరాల పాటు తన లక్ష్యానికి దూరమైనా...ఓటమితో వెనుదిరక్క మొక్కవోని దీక్షతో రెండు సంవత్సరాల పాటు అహర్నిశలు కష్టపడి తాను అనుకున్న లక్ష్యంలో భాగంగా కొద్ది రోజుల క్రితమే ఐఏఎస్ పరీక్షల్లో ఉత్తర్ణీత సాధించాడు. ప్రస్తుతం రాజన్ మధురై మసూరీలో ట్రైనింగ్ ఐఏఎస్ గా శిక్షణ పొందుతున్నాడు. సూపర్ వైజర్ నుంచి ఉన్నత శికరాగ్రానికి చేరుకున్న రాజన్ కు 6tv అభినందనలు తెలుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: