రుణమాఫీ కోసం ఏర్పాటు చేస్తున్న రైతు సాధికారత కార్పొరేషన్‌కు తక్షణమే రూ. ఏడు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జమ చేయనున్నది. ఈ మేరకు సోమవారమే సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నటప్పటికీ బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందనున్నది. అంతే కాకుండా వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లోపు మరో పది వేల కోట్ల రూపాయలను ఈ కార్పొరేషన్‌కు జమ చేసే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈలోగా ఎటూ ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికేట్లు ఉండనే ఉంటాయి. అవసరమైతే మరిన్ని సిర్టిఫికేట్లను కూడా జరీ చేసే అవకాశం ఏ మేరకు ఉందన్న విషయాన్ని కూడా చంద్రబాబు యోచిస్తున్నారు. ఇటీవలే ముగిసిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ చివరకు ప్రభుత్వానికే పెద్ద తలనొప్పిగా మారింది. ఇంత పెద్ద హామీని అమలు చేయటం చంద్రబాబు తలకు మించిన పనిగా మారింది. దాంతో నిధుల సమీకరణకు ఎన్ని మార్గాలున్నాయో అన్నీ చంద్రబాబు అన్వేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: