రాష్ట్రంలో నూతన కల్లు పాలసీతో అక్టోబర్‌ 1నుంచే నూతన కల్లు విధానం ఆరంభమైనప్పటికీ అధికారికంగా అక్టోబర్‌ 3నుంచి నూతన దుకాణాలు తెరచుకోనున్నాయి. ఈ దఫా జంటనగరాల్లో అనుమతించనున్న కల్లు దాకాణాలు బార్‌ దుకాణాల తరహాలో దర్శనమివ్వనున్నాయి. కల్లు కాంపౌండ్‌ అంటేనే కనిపించే వాతావరణాన్ని సమూలంగా మార్చి అధునాతన రీతిలో కల్లు దుకాణాలను మోడ్రనైజ్‌ చేయాలని పాలసీలో విధావిధానాలను ఖరారు చేశారు. దీని ప్రకారం ప్రతి కల్లు దుకాణం విధిగా కల్లు కాంపౌండ్‌ ఆవరణ బైటకు కన్పించకుండా పూర్తిగా కాంపౌండ్‌ వాల్‌ను ఏర్పాటు చేసుకోవాలి. విధిగా సెక్యూరిటీ గార్డును నియమించి ఎలాంటి అసౌకర్యం లేకుండా బస్తివాసులకు ఇబ్బందిలేని రీతిలో వ్యాపారం జరుపుకోవాలి. బుధవారంనుంచే లైసెన్సుల జారీ ప్రక్రియ ఆరంభం కావడంతో కొత్తగా జంటనగరాల్లో స్థలాన్వేషణ జరుగుతోంది. హైదరాబాద్‌లో 42 సొసైటీలద్వారా 103 కల్లు దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు.  2004-05లో 50 కిలోమీటర్ల దూరంలో తాటిచెట్లు ఉండాలనే నిబంధన కారణంగా జంటనగరాల్లో మూతపడిన 104 దుకాణాలను తోజాగా దసరానుంచి పారంభం కానున్నాయి. దీంతో సుదూర ప్రాంతాలనుంచి కల్లును తెచ్చకునేందుకు జీఓ నంబర్‌ -24ను సవరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5వేల టీఎఫ్టీలు, టీఎస్‌టీలు కల్లు దుకాణాలను తెరవనున్నాయి. వీటిద్వారా ఖజానాకు ఏటా రూ. 2నుంచి రూ. 5కోట్ల మేర ఆదాయం రానుంది. 2004-05లో కల్లు దుకాణాలు మూతపడిన అనంతరం సొసైటీల్లో సభుల సంఖ్య పెరగలేదు. ఈ నేపథ్యంలో అలా వీలు కాని సొసైటీలకు పర్సన్‌ ఇన్‌చార్జిల పేరుతో 6 మాసాలకే లైసెన్సులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా సభ్యత్వాలు... అయితే రాష్ట్రంలోని అన్ని సొసైటీల్లో నూతన సభ్యత్వాలకు ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు ఆబ్కారీ శాఖనుంచి వివరాలను సేకరించిన అనంతరం రాష్ట్రమంతటా ఒకేసారి సభ్యత్వ నమోదును చేపట్టాలని భావిస్తున్నారు. అయితే ఈ ధఫా సభ్యుల చేరికల్లో అనేక కఠిన నిబంధనలు అమలులోకి తేనున్నారు. ఇందులో ప్రధా నంగా ట్యాడీ టాపింగ్‌ టెస్టును పెట్టి వీడియో తీయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అర్హతకలిగిన ఏ ఒక్క సభ్యుడికీ అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఇందు లో ప్రతి సొసైటీలో వీటి పరిశీలనకు త్రీ మెన్‌ కమిటీని అధికారికంగా నియమించ నున్నారు. అక్రమాలు, అన్యాయాలపై ఈ కమిటీ పరిశీలన జరుపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: