తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెసు శాసనసభా పక్ష నేత కె జానా రెడ్డి మధ్య విభేదాలు బయటపడ్డాయి. రైతుల ఆత్మహత్యలపై పార్టీ వైఖరి ఎలా ఉండాలనే విషయంపై పొన్నాల, జానారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి షబ్బీర్ అలీ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పొన్నాల జానా రెడ్డి మధ్య అభిప్రాయభేదాలు బయటపడ్డాయి. ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలే అయినందున సంయమనం పాటించాలని కొంత కాలం వేచి చూడాలని జానారెడ్డి అభిప్రాయప్డాడరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై గొంతు ఎత్తాల్సిందేనని, అయితే ఇప్పుడే క్షేత్ర స్థాయిలో పోరాటాలు అవసరం లేనది జానారెడ్డి అన్నట్లు సమాచారం. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి 200 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ మంత్రులు సైతం బాధిత రైతు కుటుంబాలను పరామర్శించిన దాఖలు లేవని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక వైపు పంటలు పండక, పండిన పంటకు గిట్టుబాటు ధరలు రాక, మరోవైపు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: