అండమాన్ దీవులలో రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబు లభ్యమైంది. లభ్యమైన బాంబు పేలనది. ఈ పేలని బాంబును రక్షణ దళాలు సురక్షితంగా నిర్వీర్యం చేశాయి. గతవారం కార్ నికోబార్ ద్వీపం సమీపంలోని టమాలు అనే గిరిజన గ్రామంలో బాంబు లభ్యమైంది. బాంబు లభ్యమైందన్న విషయాన్ని గిరిజనులు రక్షణ అధికారులకు తెలియజేశారు. రక్షణ అధికారులు ఇవాళ బాంబును నిర్వీర్యం చేశారు. ఇప్పటికీ బాంబు చెక్కు చెదరకుండా ఉన్నట్లు రక్షణ దళాలు తెలిపాయి. 1942లో రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం అండమాన్ నికోబార్ దీవులను జపనీస్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. కానీ తిరిగి 1945లో ఈ ద్వీపాలను బ్రిటీష్ వారు స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: