మజ్లిస్ పార్టీ మహారాష్ట్రలో రెండు శాసనసభ సీట్లను గెలుచుకోవడంతో తన పునాదిని మున్సిపల్ స్థాయిలలో కూడా విస్తరింప చేసుకోవాలని సన్నద్దమవుతోంది. తొలిసారి గా హైదరాబాద్ పరిది దాటి వేరే రాష్ట్రంలో గెలుపొందిన ఎమ్.ఐ.ఎమ్. ముంబై మున్సిపల్ ఎన్నికలలో పోటీచేయాలని తలపెట్టింది.అలాగే మహరాష్ట్రలోని వివిధ మున్సిపాల్టీలలో ముస్లిం జనాభా ఎక్కువ గా ఉన్న చోట పోటీకి సిద్దమవుతోంది.అంతేకాక పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్,కర్నాటక రాష్ట్రాలలో కూడా పాదం మోపాలని, అందుకు అనువుగా ప్రణాళికలు తయారుచేసుకుని జాతీయ పార్టీగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నది.పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీలు ఈ విషయంలో మంచి ఉత్సాహంగా ఉన్నారు.తాము ఎన్నికల ప్రచారంలో ఎన్నో అవాంతరాలను ఎదుర్కోవలసి వచ్చిందని అక్బర్ వ్యాఖ్యానించారు.ఇప్పుడు తమ వాణి వినిపించడానికి అవకాశం వచ్చిందని అన్నారు. కాగా మజ్లిస్ పార్టీ పుంజుకోవడంతో సమాజవాది పార్టీకి వచ్చే ఒకటి,రెండు సీట్లు రాకుండా పోయాయని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: