ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకోవాలనే తాపత్రయం తప్ప, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేయాలనే ఆలోచనే లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మల్లుభట్టి విక్రమార్క విమర్శించారు. బంగారు తెలంగాణ అన్న కెసిఆర్‌, ఆత్మహత్యల తెలంగాణగా మార్చుతున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం కెసిఆర్‌ పాలన తుగ్లక్‌ పాలనను తలపిస్తోందంటూ ఆయన మండిపడ్డారు. సిఎల్‌పి కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోపలుసమస్యలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కెసిఆర్‌ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.రుణమాఫీ అడ్రస్‌లేకపోగా, మనఊరు-మన ప్రణాళికలో సమగ్ర సమాచారం తెప్పిం చుకోవడంతో పాటు సమగ్ర సర్వేకు కోట్లు ఖర్చు చేసి సంక్షేమ పథకాల కోసం మళ్లీ తెల్ల కాగితాలపై ఆర్జీలు తీసుకోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. పింఛన్‌ కార్డుల కోసం వితంతువులు, వృద్ధులు, వికలాంగులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా లబ్దిదారుల జాబితా ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ సంక్షేమపథకాల కోసం మళ్లీ దరఖాస్తులు కోరడం తుగ్లక్‌ పాలనను తలపిస్తోందన్నారు. ఇలాంటి అనాలోచిత చర్యలు ముమ్మాటికీ ప్రజలను హింసించడానికేనన్నారు. కెసిఆర్‌ తన శాడిజంతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రియాంకగాంధీ రాజకీయల్లోకి రావాలనిపార్టీకార్యకర్తల కోరుతుండడపై మీ అభిప్రాయం ఏమిటన్న ప్రశ్నకుభట్టి స్పందిస్తూ ప్రియాంక గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకిరావడం అనేది ఆమెవ్యక్తిగత విషయమని చెప్పారు. ఇప్పటికే ఆమె ఉత్తరప్రదేశ్‌లో ప్రచారకురాలుగా ఉన్నారని పేర్కొన్నారు.మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్‌ ఘోర పరాజయం పట్ల ఆయనస్పందనకోరగా కాంగ్రెస్‌కు గెలుపోటమిలు సహజమేనని మల్లుభట్టి సమాధాన మిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: