మహారాష్ట్రలో అదికారాన్ని సాధించుకోవడానికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ తన ప్రయత్నాలు తీవ్రం చేసింది. అంతా కలిసి వస్తే.. తాము అనుకొన్నట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే పర్వాలేదు.. లేకపోతే ఇతర పార్టీలను నిలువునా చీల్చి అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ వ్యూహాన్ని రచిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పాతికమంది ఎమ్మెల్యేల బలం అవసరమైన స్థితిలో ఉన్న బీజేపీ వలసవాద ఎమ్మెల్యేలతో ఆ బలాన్నిసమీకరించుకోగలమని భావిస్తోంది. మొన్నటి ఫలితాల్లో బీజేపీకి లభించిన సీట్ల సంఖ్య 122 అయితే ఇప్పుడు తమ వద్ద 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని భారతీయ జనతా పార్టీ నేతలు అంటున్నారు. ఇండిపెండెంట్లుగా విజయం సాధించిన వారిని ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తమవైపుకు తిప్పుకొంది. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు మరో పది మంది ఎమ్మెల్యేలు లభిస్తే చాలు బీజేపీ ఓన్ గా గవర్నమెంటును ఫామ్ చేయగలుతుంది! ఇందుకోసం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు భారతీయ జనతా పార్టీ వల వేయనుందని తెలుస్తోంది. ఆ పార్టీల తరపున గెలిచిన ఎమ్మెల్యేలను తమవైపు కు తిప్పుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యత్నంలో ఉందట భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే మహారాష్ట్ర నవనిర్మాణ సేనకు చెందిన ఏకైక ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీకి జైకొడుతున్నాడట. ఆయన దాదాపుగా గోడ దాటేసినట్టు తెలుస్తోంది. అలాగే శివసేన నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు భారతీయ జనతాపార్టీలోకి జంప్ చేయడానికి సిద్ధమని తెలుస్తోంది. అలాగే ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో కూర్చొనే ఓపిక లేని కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా కొందరు జంప్ జిలానీలు అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ గా వలస వాదులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకోవాలే కానీ.. బీజేపీకి అవసరమైన స్థాయిలో ఎమ్మెల్యేలను సంపాదించుకోవడం పెద్ద కష్టమేం కాదని తెలుస్తోంది. మరేం జరుగుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: