హుదుద్ తుపాను సహాయ చర్యలపై స్వయంగా చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగడంతో.. అవి యుద్ధ ప్రాతిపదికన జరిగాయి. మంత్రులు, రాజకీయనేతలు, అధికారులు.. ఇలా అన్ని వర్గాలనూ సమన్వయం చేసి.. సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చంద్రబాబు అండ్ టీమ్ చర్యలు తీసుకున్నారు. గోదావరి జిల్లాల నుంచి నీళ్లు, కూరగాయలు తెప్పించడం.. విద్యుత్ సిబ్బందిని కూడా పొరుగు జిల్లాల నుంచి రప్పించడం మంచి ఫలితాలనే ఇచ్చాయి. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు క్రమంగా కోలుకుంటున్నాయి. అంతా బాగానే ఉన్నా.. టీడీపీ మంత్రులు, నాయకులు.. సహాయ చర్యలకన్నా.. ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తుండటం విమర్శల పాలవుతోంది. పనులను సీరియస్ గా చేయించడం కంటే.. ఫోటోలకు, మీడియాకు ఫోజులివ్వడానికే వారు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీంతో సహాయ చర్యల సీరియస్ నెస్ తగ్గిపోతోంది. మొన్నటికి మొన్న సీఎం చెట్లు తొలగించే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అంతటితో ఆగకుండా చంద్రబాబు చెట్లు తొలగించే క్రేన్ ఎక్కి మరీ మీడియాకు ఫోజులిచ్చారు. స్వయంగా చెట్లు రంపంతో కోసి.. వాటికి రంగులు వేశారు. సీఎం హాడావిడితో ఆ కార్యక్రమానికి గంటల తరబడి బ్రేక్ పడింది. సీఎం చంద్రబాబు తీరే అలా ఉంటే.. మంత్రుల తీరు అందుకు భిన్నంగా ఎలా ఉంటుంది. వారు కూడా ఆయన బాటలోనే పయనిస్తున్నారు. తాజాగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహాయ కార్యక్రమాల్లో భాగంగా ట్రాక్టర్ నడుపుతూ మీడియాకు ఫోజులిచ్చారు. లోకల్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుతో పాటు ట్రాక్టర్‌ లో కూర్చొన్నారు. వీరి హడావిడితో సహాయ చర్యలకు ఆటంకం కలిగింది. వీరి ప్రవర్తన కారణంగా.. చేస్తున్న మంచి పనులు కూడా ప్రచారం కోసమే అనే అభిప్రాయం జనంలో కలిగే ప్రమాదం ఉంది. మంత్రులూ జాగ్రత్త.

మరింత సమాచారం తెలుసుకోండి: