తన తండ్రి ఫించన్ లబ్దిదారుల జాబితాలో ఉన్నారంటూ తప్పుడు ప్రచారం చేశారని ఎపి ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, ఈనాడు ప్రధాన సంపాదకులు రామోజీరావుకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి లీగల్ నోటీసు పంపారు.దీనివల్ల తన పరువు కు భంగం కలిగిందని ఆయన ఈ నోటీసులు ఇచ్చి పదిహేను రోజులలో నష్టపరిహారంగా ఇరవై లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ‘చెవిరెడ్డి తండ్రి సుబ్రమణ్యంరెడ్డికి పింఛను వస్తుందని, ఆ పింఛను ఎవరు తీసుకుంటున్నారో చెప్పాలని, చెవిరెడ్డి తండ్రికి పింఛను ఇవ్వాలా, దీనిపై జగన్‌మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి’ అని పత్రికా సమావేశంలో పరకాల ప్రభాకర్ ఇటీవల సవాల్ విసిరారు. దీనిని ‘ఈనాడు’ పత్రిక ప్రముఖంగా ప్రచురించిందని చెవిరెడ్డి తెలిపారు.తన వివరణను కూడా ఈనాడు పట్టించుకోలేదని ,కావాలనే తన పరువుకు భంగం కలిగించేలా ఈనాడు వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.కాగా అదికారులు పొరపాటున చెవిరెడ్డి తండ్రి పేరు పించన్ లబ్ది దారుల జాబితాలోకి వచ్చిందని వివరణ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: