రాష్ట్ర విభజన సమయంలో రాసుకున్న ట్లుగా వ్యవహరించకుండా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిబంధనలను కాలరాస్తున్నాడని ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు రావలసిన విద్యుత్‌ను రాకుండా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. శ్రీశైలం విద్యుత్‌ ఉత్పత్తిపై కృష్ణా రివర్‌ బోర్డుకు లేఖ రాయడం దుర్మార్గమన్నా రు. చంద్రబాబు వ్యవహారశైలి వల్లే తెలంగాణ ప్రజలు విద్యుత్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. విభజన చట్టంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్‌లో 54శాతం తెలంగాణకు రావలసి ఉన్నా కుట్రపూరితంగా కృష్ణపట్నం, దిగువ సీలేరు ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను తెలంగాణకు దక్కకుండా చేయడమే కాకుండా ఇప్పుడు తాజాగా శ్రీశైలం విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ద్వారా రావలసిన విద్యుత్‌ను కూడా రాకుండా చేయడం ఆయన రాక్షసత్వానికి నిదర్శనమన్నారు. పిపిఎల రద్దు మొదలు చంద్రబాబు అన్నీ కుట్రలే చేస్తున్నాడన్నారు. తెలంగాణ ప్రజలపై చంద్రబాబు పగ సాధిస్తు న్నాడని, తెలంగాణకు రావలసిన నీటిని, విద్యుత్‌ను రాకుండా ద్రోహం తలపెడుతున్నా రంటూ మండిపడ్డారు. ఆంధ్రా బాబు అడుగ డుగునా తెలంగాణను మోసం చేస్తున్నాడని, నాగార్జునసాగర్‌ విద్యుత్‌ ఉత్పత్తిని సైతం నిలిపివేయాలని డిమాండ్‌ చేయడం దారుణ మన్నారు. అసలే విద్యుత్‌ సమస్యతో సతమత మవుతున్న తెలంగాణ ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేసేందుకు పుండు మీద కారం చల్లినట్లుగా కృష్ణా రివర్‌ బోర్డుకు చంద్రబాబు లేఖ రాసాడని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు లోబడే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నామని, ప్రస్తుతం 166 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ ఉండగా, 143 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను సరఫరాకు అందుబాటులో ఉంచామని, ఇప్పటికే సమస్య అధికమవు తుంటే మళ్ళీ కొత్త సమస్యను తీసుకువచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నించడం దారుణమన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: