చైనాకు చెందిన కంప్యూటర్ తయారీ సంస్థ ‘లెనోవో’….. కెనడాకు చెందిన ఫోన్ల తయారీ సంస్థ ‘బ్లాక్ బెర్రీ’ని కొనబోతుందని వార్తలు వినిపిస్తోన్నాయి. లెనోవో కూడా ఈ మధ్యకాలంలో ఫోన్లు తయారు చేస్తుండటంతో…. బ్లాక్ బెర్రీని కొంటే తమ బిజినెస్ ని పెంచుకోవచ్చని ఆలోచిస్తోంది. ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, బ్లాక్ బెర్రీ ని ఇతరులకు అమ్మొద్దని కస్టమర్ల నుంచి చాలా మెయిల్స్ వస్తున్నాయి ఆ సంస్థకు. అంతేకాకుండా, కెనడా ప్రభుత్వం కూడా ఈ విషయంపై సీరియస్ అయింది. ఇతర దేశాలకు కంపెనీని అమ్మాలంటే కెనడా ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి. దీంతో, ప్రభుత్వమే అమ్మకాన్ని వ్యతిరేకిస్తోండటంతో పర్మిషన్ ఇవ్వడం అనుమానమే. ఈ విషయంపై వార్తలు రావడంతో స్టాక్ మార్కెట్లో బ్లాక్ బెర్రీ షేర్లు 3 శాతం పడిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: