పైకేమో తనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఎలాంటి ఆశలూ లేవని చెబుతున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ లోలోల మాత్రం ఆ పదవి కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేల ద్వారా ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్రమైనప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో కొంతమంది ఇప్పుడు నితిన్ గడ్కారీని ముఖ్యమంత్రిగా చేయాలనే డిమాండ్ ను వినిపిస్తున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని.... ఈ విషయంలో ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందని తెలుస్తోంది. అసలు భారతీయ జనతా పార్టీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కుదిరేపని కాదు. ఇతర పార్టీ ఏదైనా మద్దతు పలికితేనే బీజేపీ మహారాష్ట్రలో భీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు. ఆ పార్టీలు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో అభ్యంతరాలు చెప్పే అవకాశాలుంటాయి. అయితే ముందుగా బీజేపీ నేతల మధ్యనే ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఈ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు నాగపూర్ లోని గడ్కరీ నివాసంలో సమావేశమైనట్టు తెలుస్తోంది. 40 మంది ఎమ్మెల్యేలు గడ్కారీకి మద్దతు తెలిపినట్టు వార్తలు వెలువడుతున్నాయి. గడ్కరీనే ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలంటూ మహారాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు సుధీర్ ముంగటివార్ కూడా డిమాండ్ చేస్తున్నాడు. మరోవైపు పదవి కోసం దేవేంద్ర పడ్నవీస్ రేసులో ఉన్నాడు. పంజక ముండే కూడా చాలా ఆశలే పెట్టుకొంది. మరి ఇటువంటి నేపథ్యంలో గడ్కారీ కూడా రేసులోకి వచ్చాడు. మరే ఎవరు విజేతగా నిలిస్తారో.. ఎవరు పదవిని చేపడతారో!

మరింత సమాచారం తెలుసుకోండి: