తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యా లయంపై టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు చేసిన దాడిని నిరసిస్తూ బుధవారం టిడిపి ఇచ్చిన జిల్లా బంద్‌ పాక్షికంగా జరిగింది. గురువారం దీపావళి కావడం తో కొన్ని పట్టణాల్లో వ్యాపారాలు, వాణిజ్యసంస్థలు యధావిధిగా కొనసాగాయి. మధ్యాహ్నం 12 గం టల వరకే బంద్‌ ప్రభావం కనిపించింది. కాగా, బంద్‌లో పాల్గొనేందుకు వస్తున్న టిడిపి నాయకులు ఎల్‌.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులును చిట్యాల వద్ద పోలీసులు అడ్డుకు న్నారు. జిల్లాలో 144 సెక్షన్‌ విధించామంటూ వారి ని అరెస్టు చేసి రామన్నపేట పోలీసుస్టేషన్‌కు తర లించారు. టిడిపి కార్యకర్తలు పోలీసుల తీరును నిరసిస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిం చారు. టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు టిడిపి నాయకుల వాహనాలపై రాళ్ళు రువ్వడంతో కొద్దిసేపు చిట్యా లలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసుల అప్రమ త్తమై ఇరు పార్టీల కార్యకర్తలను అరెస్టు చేశారు. అదేవిధంగా టిడిపి నాయకులు రేవంత్‌రెడ్డి, రమేష్‌ రాథోడ్‌లు బంద్‌లో పాల్గొనేందుకు వస్తుండగా భూదాన్‌ పోచంపల్లి మండల పరిధిలోని కొత్తగూడెం వద్ద పోలీసులు అరెస్టు చేయడం తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని టిడిపి జిల్లా అధ్యక్షులు బిల్యానాయక్‌ ఆరోపించారు. ఇదిలా ఉండగా, తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా టిడిపి కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి నిరసనలు తెలిపారు. కోదాడలో రాస్తారోకో, బైక్‌ ర్యాలీ నిర్వహించగా సూర్యాపేట, భువనగిరి పట్టణంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టారు. పలు ప్రాంతాల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి కొద్దిసేపటికి విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా వ్యాపార వాణిజ్య సంస్థలు-పాఠశాలలు, కళాశాలలు బంద్‌కు మద్దతు తెలిపాయి. దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ బస్సులను బంద్‌ నుండి మినహాయించారు. జిల్లాలో బంద్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటలు జరగకుండా జిల్లా ఎస్పీ టి.ప్రభాకర్‌ రావు భారీ పోలీస్‌ బంద్‌ ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: