విజయవాడ-గుంటూరు పరిసరాల్లో స్మార్‌‌టసిటీని నిర్మించటంలో జపాన్‌ బృందం ఆశక్తిని చూపుతోంది. అంతేకాకుండా మొత్తం పదివేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి కూడా జపాన్‌ బృందంసంసిద్దతను వ్యక్తం చేసింది. బుధవారం సచివాలయంలో జపాన్‌ బృందం ఏపి ముఖ్యమంత్రి చం ద్రబాబు నాయడుతో సమావేశమైంది. ఈ సందర్భంగా బృందానికి నేతృత్వం వహించినచెనై్నలోని జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ సుగియమా మాట్లాడుతూ, విశా ఖపట్నంలో నాలుగు వేల మెగావాట్ల ఉత్పత్తి సమర్ధ్యంతో ఒక థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌,శ్రీకాకుళంలో నాలుగువేల మెగావాట్ల సామర్ధ్యంతో మరో థర్మల్‌ విద్యు త్‌ ప్లాంట్‌తోపాటు అనంతపురంలో రెండు వేలమెగావాట్ల ఉత్పత్తి సమర్ధ్యంగల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. అంతేకాకుండా వ్యవసాయ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలతో పాటు కోల్‌‌డ చైన్‌‌స, ఫుడ్‌పార్కులతో పా టు పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కూడా ఆశక్తి ఉన్నట్లు తెలిపారు. పై రం గాల్లో జపాన్‌ దేశానికి-ఆంధ్రాకు మధ్య ఉన్నత సాంకేతికతను బదిలీ చేయాల ని ఆశక్తి ఉన్నట్లు తెలిపారు. అలాగే, ఢిల్లీ-ముంబాయి మధ్య సరుకు రవాణా కోసం ప్రత్యేక మార్గం ఏర్పాటుతో పాటు బెంగళూరు-చెనై్న మధ్య పారిశ్రామిక కారిడార్‌ నిర్మాణంపై దృష్టి ఉన్నట్లు చెప్పారు. వచ్చే నెలలో ఢిల్లీలోని 100 సంస్ధల యాజమన్యాలతో సమావేశమవుతున్న ట్లు కూడా బృందం ముఖ్యమంత్రితో చెప్పింది. బుధవారం ముఖ్య మంత్రిని కలసిన జపాన్‌ బృందంలో జపాన్‌ ఎక్‌‌సటెర్నల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేష న్‌(జెట్రో), జపాన్‌ బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కో ఆప రేషన్‌(జెబిఐసి), న్యూ ఎనర్జీ అండ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌(ఎన్‌ ఇడిఒ), జపాన్‌ ఎంబసి అండ్‌ జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ ఏజెన్సీ(జైకా) లకు చెందిన పలువురు సమావేశమయ్యారు. అనంతరం, చంద్రబాబు మాట్లా డుతూ, జపాన్‌-ఏపిల మధ్య పారిశ్రామిక, సాంకేతిక రంగాల అభివృద్దికి పరి శ్రమలు, మౌళిక సదుపాయాలు, విద్యుత్‌, ఐటి, వ్యవసాయ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో పాటు రాజ్యసభ సభ్యుడు వై. సత్యనారాయణ చౌధరి (సుజనా చౌధరి), ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మో హన్‌రావు తదితరులుం టారని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: