ఆంధ్రప్రదేశ్ ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాలించడం లేదు అని అంటున్నాడు కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం కొందరు కార్పొరేట్ల పాలనలో ఉందని ఏపీ పీసీసీ చీఫ్ ఆరోపిస్తున్నాడు. ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు ఒట్టి షో చేస్తున్నాడని.. ఆయన బదులు సీఎం రమేశ్ , సుజనాచౌదరి వంటి పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్ లో పాలన చేస్తున్నారని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించాడు. మరి బాబు వంటి నేత ముఖ్యమంత్రి గా ఉన్న ప్రభుత్వం పై ఇలాంటి ఆరోపణలు రావడం విశేషమే అనుకోవాల్సి వస్తోంది. తను ఒక బెస్ట్అడ్మినిస్ట్రేటర్ ను అని చంద్రబాబు తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకొంటారు. అలాంటిది బాబు అసలు పాలనే చేయడం లేదని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. ప్రస్తుతానికి బాబు వెనుక కోటరిని కాంగ్రెస్ వాళ్లు లక్ష్యంగా చేసుకొన్నట్టున్నారు. ఎన్నికల ముందు నుంచినే సుజనా, సీఎం రమేశ్ వంటి వాళ్లు టీడీపీ వ్యవహారాలను సమీక్షిస్తున్నారని.. పార్టీలో వారు చెప్పిందే వేదం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి తమ నిర్ణయాల ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వాళ్లు ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తున్నారనేది కాంగ్రెస్ ఆరోపణ. అయితే ఎన్ని ఆరోపణలు చేసినా.. ఎలాంటి ఆరోపణలు చేసినా కాంగ్రెస్ వాయిస్ కు ఇప్పుడు పవర్ లేదు. అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ ఎంతగా ఆక్రోశించినా పట్టించుకొనే వారు ఎవరూ లేదు. పరిస్థితులు అలా ఉన్నాయి మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: