ఉడా పరిధిలో విజయవాడ, గుంటూరు, తెనాలి చుట్టూ అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది.... దీనికి సంబంధించి 180 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి 19,700 కోట్ల రూపాయల నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది... ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియపరిచింది... అయితే ప్రాజెక్టుకు అవసరం అయిన సుమారు నాలుగువేల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి ఇవ్వాలని కేంద్రం షరతు విధించింది.... కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాధమిక అనుమతులు రావడంతో... డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయడానికి కన్సల్టెంట్ లను వెతికే పనిలో పడింది ఏపీ ప్రభుత్వం.... అవుటర్ రింగ్ రోడ్డుకు అవసరం అయిన వేలాది ఎకరాల భూమిని భూ సేకరణ ద్వారా లేక భూ సమీకరణ ద్వారా సేకరించాలా అనే విషయంపై ప్రభుత్వ పెద్దలు చర్చిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: