సోషల్ మీడియా అకౌంట్ల మెయిల్ ఐడీలు, పాస్ వర్డ్స్ గుర్తుంచుకోవడానికి ఇబ్బందిపడే వారికి శుభవార్త. ఇక నుంచి పాస్ వర్డ్ లేకుండానే ట్విట్టర్ లో లాగిన్ కావచ్చు. తమ మొబైల్ వినియోగదారుల కోసం డిజిట్స్ అనే కొత్త యాప్ ను రూపొందించింది ట్విట్టర్. ఈ యాప్ ద్వారా మెయిల్ ఐడీ, పాస్ వర్డ్ లేకుండానే ట్విట్టర్ లోకి లాగిన్ కావచ్చు. వాట్సాప్ లానే ముందుగా మొబైల్ నెంబరుతో ఈ డిజిట్స్ లో రిజిస్టర్ కావాలి. ఇలా స్మార్ట్ ఫోన్లలో ఇక నుంచి పాస్ వర్డ్ ఎంటర్ చేసే పని లేకుండా, ట్విట్టర్ ను వినియోగించుకోవచ్చు. త్వరలోనే ఈ యాప్ ను ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం విడుదల చేయనున్నట్టు ట్విట్టర్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: