స్మార్ట్ ఫోన్ల తయారీలోనే కాక, తొలితరం కంప్యూటర్ల తయారీదారుగా పేరెన్నికగన్న యాపిల్ మరో ఘనతను సాధించింది. యాపిల్ రూపొందించిన తొలి తరం కంప్యూటర్ 'యాపిల్ ఐ', బుధవారం నాటి వేలంలో రికార్డు ధరకు అమ్ముడైంది. ప్రముఖ వేలం సంస్థ బాన్ హామ్స్ నిర్వహించిన వేలంలో యాపిల్ ఐ రూ.5.43 కోట్ల రికార్డు ధర పలికింది. యాపిల్ రూపొందించిన తొలి 50 యాపిల్ ఐ కంప్యూటర్లలో ఇది కూడా ఒకటి. 38 ఏళ్ల కింద తయారైన ఈ కంప్యూటర్ కు అత్యధికంగా రూ.3 కోట్ల ధర పలికే అవకాశముందని భావించిన బాన్ హామ్స్ అంచనాలను తలకిందులు చేస్తూ, ఆ కంప్యూటర్ దాదాపు ఐదున్నర కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. గతంలో సౌత్ బీ సంస్థ వేలం వేసిన ఇదే తరానికి చెందిన ఓ కంప్యూటర్ రూ.2.25 లక్షల ధర పలికింది.

మరింత సమాచారం తెలుసుకోండి: