కాంగ్రెస్ ఆధినేత్రి సోనియా గాంధీ పై ఇటలీ పత్రిక జేంట్ సంచలాత్మక కధనం ప్రచురించింది. అంటానియా మైనో (సోనియా గాంధీ ముందు పేరు ) కు ముందు ఓ ఫుట్ బాల్ ఆటగాడితో ప్రేమ వ్యవహారం వుండేదని అతడి ఇంటర్వ్యూ వెలువడింది. 1964 లో అంటానియా ఇంగ్లాండ్ పోకముందు తనతో నాలుగేళ్లు చెట్టాపట్టాలేసుకున్నామని ఫ్రాంకో లూయిజన్ చెప్పాడు. ఇద్దరి కుటుంబాలు తమ ప్రేమకు ఓకే అన్నాయని అంటున్న ఫ్రాంకో టూరిన్ ప్రాంతంలోని ఆర్బాస్సనో లోని అంటానియా ఇంటికి తరచూ వెళ్లేవాడని చెప్పుకోచ్చాడు. నాలుగేళ్ల తమ ప్రేమ వ్యవహరంతో అంటానియా పలు సార్లు తనతో పెళ్లి ప్రస్తావన తెచ్చిందని, తానే వాయిదాలు వేసానని అన్నాడు. తరువాత అమె లండన్ పోవడం, రాజీవ్ గాంధీని కలవడం జరిగిందన్నాడు.రాజీవ్ గురించి తనకు రాసిన ఉత్తరాలలో ప్రస్తావించిందని, తాము స్నేహపూర్వకంగారే విడిపోయామని అన్నాడు.ఇద్దరి ఫోటోలు కుడా పత్రికలో ప్రింట్ అయ్యాయి. ఇంతకు ఫ్రాంకో మాత్రం 2012 సెప్టెంబర్ 25 న మరణించాడు. అతను చనిపోయిన రెండు సంవత్సరాలకు ఫేస్ బుక్ ఇన్వేస్టిగేషన్ పేరిట వచ్చిన ఈ కధనం మాత్రం పలు అనుమానాలు, సంచలనాలు సృష్టిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: