టిడిడి బోర్డులో తెలంగాణా టిడిపి నేతలకు స్థానం కల్పించాలని ఇక్కడి నేతలు చంద్రబాబును కోరారు. అందుకు చంద్రబాబు అంగీకరించారు. తెలంగాణా కు చెందిన ముగ్గురిని టిటిడి పాలక మండలిలో నియమించాలని చంద్రబాబు యోచించారు. దినికి ఆంధ్రా తెలుగు తమ్ముళ్ళనుంచి తీవ్ర వ్యతిరేఖత వ్యక్తం అవుతోంది. టిటిడి బోర్డులో కర్ణాటక తమిళ నాడు లాంటి పొరుగు రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరినీ నియమించేసాంప్రదాయం వుంది. అదే పద్దతిలో ఇప్పడు తెలంగాణ నుంచి కూడా ఒక్కరికే స్థానం ఇవ్వాలని ఆంధ్ర టిడిపి నేతల వాదన. ఆంధ్రలో అధికారం వుంది. తెలంగాణలో కష్టాల్లో వున్నాం కనుక తమకు పదవులిచ్చి ఆదుకోవాలని తెలంగాణా టిడిపి నేతల ఆవేదన. పాపం చంద్రబాబుకు కష్టం వచ్చింది. ఈ లోగా కేంద్రబిజేపినుంచి కూడా పైరవీలు వస్తున్నాయట. ఇది చంద్రబాబుకు మరింత తలనొప్పిగా మారింది. శ్రీవారి సన్నిధిలో కూడా చిల్లర రాజకీయాలు తప్పటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: