తాము విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నది 900 మెగావాట్లు అయితే మూడు వందల మెగావాట్లు ఇస్తామంటే ఎలా ఒప్పుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశ్నించారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేసే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. తాను కూడా చర్చకు సిద్దమేనని , ప్రకాశం బ్యారేజీ వద్ద అయినా చర్చకు సిద్దమేనని , అబిడ్స్ లోని నెహ్రూ విగ్రహం వద్ద అయిన ఆ చర్చకు రెడీ అని కెసిఆర్ అన్నారు.రుణాల మాపీ పై చంద్రబాబు చేసిన ప్రసంగం ఫుటేజీని కూడా తీసుకువస్తామని అన్నారు. తెలంగాణలో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి కదా అని అడగ్గా, అంత సంఖ్యలో ఉన్నట్లు తమ దృష్టికి రాలేదని, అయినా విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఆంద్రలో 1500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కెసిఆర్ అన్నారు.చంద్రబాబు హయాంలో తెలంగాణలో ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి జరగలేదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: