నీటి వివాదాలు ఇప్పట్లో ముగిసే లా కనబడటంలేదు. ఒకవైపు శ్రీశైలంలో జలవిద్యుత్‌ ఉత్పత్తి చేపడుతున్న తెలం గాణా ప్రభుత్వంపై ఏపి ముఖ్యమంత్రి తీ వ్రస్దాయిలో ధ్వజమెత్తు తుండగా తాజా గా నాగార్జునసాగర్‌ జలాశయంలో కూ డా తెలంగాణా ప్రభుత్వం జలవిద్యుత్‌ మొదలుపెట్టింది. విభజన చట్టాన్ని ఉల్లం ఘించి తెలంగాణా ప్రభుత్వం శ్రీశైలం జ లాశయంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని చంద్రబాబు గతకొద్ది రోజులుగా ఆరోపి స్తున్నారు. అంతేకాకుండా తెలంగాణా ఉ ల్లంఘన విషయాన్ని ఇటు కేంద్రప్రభు త్వం దృష్టికి తీసుకెళ్ళటంతోపాటు అటు కృష్ణా వాటర్‌ బోర్డు దృష్టికి కూడా తీసుకె ళ్ళారు. దాంతో తెలంగాణా భారీ నీట పా రుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు కూ డా చంద్రబాబుపై ఎదురుదాడులు మొద లుపెట్టారు. దీంతో రెండు రాషా్టల్ర మధ్య వాతావరణం బాగా వేడెక్కింది. అయినా, చంద్రబాబు బోర్డు ఛైర్మన్‌ ఎస్‌కెజి పండి ట్‌కు మళ్ళీ ఒక లేఖరాసారు. ఈ నేప ధ్యంలో శుక్రవారం బోర్డు ఛైర్మన్‌ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాల యంలో కలిసారు. శ్రీశైలం జలాశయం లో తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన విద్యు త్‌ ఉత్పత్తి వల్ల ఆంధ్రాకు జరుగుతున్న న ష్టాన్ని ఉదాహరణలతో సహా చంద్రబాబు వివరించారు. తెలంగాణా ప్రభుత్వం శ్రీ శైలంలో జలవిద్యుత్‌ ఉత్పాదన ఆపకపో తే భవిష్యత్తులో రాయలసీమ ఎడారిగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేసా రు. విద్యుత్‌ ఉత్పత్తి కూడదని బోర్డు ఆదేశించినా తెలంగాణా ప్రభుత్వం పట్టించుకోని వైనాన్ని చంద్రబాబు ఎండగట్టారు. దీనిపై స్పందించిన ఛైర్మన్‌ మాట్లాడుతూ, తాను ఇదే విషయాన్ని తెలంగాణా ప్రభుత్వంతో మాట్లాడినట్లు తెలిపారు. శ్రీశైలం జలాశయంలో విద్యుత్‌ ఉత్పత్తిని నిలుపుదల చేస్తున్నట్లు తనకు తెలంగాణా ప్రభుత్వం చెప్పిందన్నారు. శ్రీశైలం జలవిద్యుత్‌ ఉత్పత్తి వివాదంపై త్వరలోనే రెండు రాషా్టల్ర ప్రతినిధులతోనూ సమావేశం నిర్వహిస్తానని పండిట్‌ చెప్పారు. అయితే, శ్రీశైలం జలాశయంలోనే కాకుండా నాగార్జున సాగర్‌లో కూడా తెలంగాణా ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించినట్లు చంద్రబాబు మరో అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు కృష్ణావాటర్‌ బోర్డు ఛైర్మన్‌ పండిట్‌తో ఏపి నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్‌రావు, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీశైలం జలవిద్యుత్‌ సమస్యను మంత్రి ఛైర్మన్‌ దృష్టికి తీసుకెళ్ళారు. శ్రీశైలంలో జలవిద్యుత్‌ విషయంలో తెలంగాణా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతోందని మంత్రి ఫిర్యాదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: