ప్రధానమంత్రి నరేంద్రమోడీ చాలా సింపుల్ గా మొదలుపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమం ఇప్పుడు కాంగ్రెస్ కు చుక్కలు చూపిస్తోంది. అనుకోని చోట తగిలి మంటపెడుతోంది. ఏకంగా ఒక ఎంపీ ని దూరం చేసేలా ఉంది ఈ పరిణామం. ప్రధానమంత్రి మొదలుపెట్టిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమానికి పూర్తిగా మద్దతు ప్రకటించాడు శశిథరూర్. మన్మోహన్ క్యాబినెట్ లో ఉండిన ఆయన ఇప్పుడు మోడీకి ఫ్యాన్ గా మారాడు. అధిష్టానం వద్దు వద్దు అంటున్నా... స్వచ్ఛ్ భారత్ కు ఆయన మద్దతు ప్రకటిస్తున్నాడు. కాంగ్రెస్ ఎంపీ హోదాలో ఉండి... భారతీయ జనతా పార్టీ ఎంపీలకు ధీటైన స్థాయిలో స్వచ్ఛ్ భారత్ కు మద్దతు ప్రకటిస్తున్నాడాయన. తాజాగా ట్విటర్లో ఫోటోలు పెట్టి మరీ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టుగా ఆయన ప్రకటించాడు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శశిథరూర్ విషయంలో రకరకాలుగా ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనను కంట్రోల్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మోడీ ఫ్యాన్ గా మారినందుకు శిక్షగా థరూర్ ను పార్టీ పదవి నుంచి తప్పించింది. అయినప్పటికీ థరూర్ వెనక్కు తతగ్గడం లేదు. మోడీ ని మెచ్చుకొంటూనే ఉన్నాడు. మరి ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎలా నియంత్రించుకొంటుందో. చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: