ప్రత్యేక తెలంగాణ ఉద్యమం... సమైక్యాంధ్ర ఉద్యమం పోటా పోటీగా జరిగాయి.వేరు వేరు సమయాల్లో ఇవి ఉదృతస్థాయిలో జరిగాయి. అనేక మంది ఈ పోరాటాల్లో పాలు పంచుకొన్నారు. వీటిలో ప్రత్యేక ఉద్యమం విజయవంతం అయ్యింది. సమైక్య ఉద్యమం మాత్రం ఫెయిలయ్యింది. కాంగ్రెస్ అధిష్టానం ఆడిన గేమ్ లో సమైక్యాంధ్ర ఉద్యమం తట్టుకోలేకపోయింది. ఎంత ఉదృతం గా జరిగినా రాష్ట్ర విభజన జరిగిపోయింది. మరి ఇలా రెండు ఉద్యమాలకూ రెండు రకాల అనుభవాలు ఎదురైనా... రెండు ఉద్యమాల పోరాటకర్తలకూ మాత్రం కేసుల అనుభవం మాత్రం మిగిలింది. ప్రత్యేక, సమైక్య ఉద్యమాల్లో క్రియాశీల, కీలక పాత్రలు పోషించిన వారిపై కేసులు నమోదయ్యాయి. ప్రజాఉద్యమాలు అయిన ఈ ఉద్యమాల్లో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేయాలని అనేక మంది డిమాండ్ చేస్తూ వచ్చారు. తెలంగాణలో ఈ స్వరం గట్టిగా వినిపించింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణలో ఉద్యమకారులపై కేసులను ఎత్తివేయడం జరిగింది. అయితే ఏపీలో మాత్రం సమైక్య ఉద్యమాకారులకు కేసుల తిప్పలు తప్పలేదు. వాళ్లు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారికి ఎట్టకేలకూ ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చింది. సమైక్య ఉద్యమకారులపై నమోదయిన కేసులను ఎత్తివేశారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన చేసింది. సమైక్య ఉద్యమాకారులకు రిలీఫ్ ను ఇచ్చింది. మొత్తానికి కాస్త లేటుగానైనా తెలంగాణ ప్రభుత్వం దారినే ఫాలో అయ్యింది ఏపీ గవర్నమెంట్.

మరింత సమాచారం తెలుసుకోండి: