కాశ్మీర్, జార్ఖండ్ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఆ రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలతో పాటు మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లోనూ కమలం హవా కనిపించడంతో అదే పరిస్థితి ఈ రెండు రాష్ట్రాల్లోనూ కొనసాగుతుందా అనే విశ్లేషణలు ఆరంభమయ్యాయి. ఇప్పటికే నరేంద్రమోడీ ప్రభంజనం ముందు విలవిల్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి కాశ్మీర్, జార్ఖండ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు మరో పరీక్ష కానున్నాయి. ఈ రెండు రాష్ట్రాల పరిస్థితులు పరిశీలిస్తే.. కాశ్మీర్లో ప్రస్తుతం నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. ఇక కాశ్మీర్లోని మరో ప్రధాన పార్టీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ. ప్రస్తుతం ప్రతిపక్ష స్థానంలో ఉన్న ఈ పార్టీ ఈ ఎన్నికల్లో ఎన్సీని తుడిచిపెట్టేయగలనన్న భావనలో ఉంది. కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు తెగదెంపులు చేసుకుని విడిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో 44 లోక్‌సభ స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీతో కొనసాగడం కంటే విడిపోవడమే మేలని ఆయన భావిస్తున్నారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లోనూ, తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆశ్చర్యకర ఫలితాలు సాధించిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలపై ఆశలు పెట్టుకున్నది. కాశ్మీర్‌లో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనీ బీజేపీ ఎంపీ జుగల్ కిశోర్ అంటున్నారు. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే... ఇక్కడ కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి ఏడాదిన్నరగా జార్ఖండ్ ముక్తి మో ర్చా (జేఎంఎం) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2000లో జా ర్ఖండ్ ఏర్పాటైన తర్వాత ఆ రాష్ట్ర అసెంబీక్లి ఎన్నికలు జరగడం ఇది మూడోసారి. తొలి నుంచి రాజకీయ అస్థిరతతో సంకీర్ణాలే ఏర్పాటయ్యాయి. 81 స్థానాల అసెంబ్లీలో 10 మంది రాజీనామాతో 71 మం ది ఎమ్మెల్యేలు ఉన్నా రు. సా ర్వత్రిక ఎన్నికల్లో 14 లోక్‌సభ స్థా నాలకు బీజేపీ 12 స్థా నాలు గెలుచుకుని హవా కొనసాగిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలం పార్టీ అదే జోరు చూపిస్తే.. ఇక్కడ కూడా కమలాధీశులు అధికారం చేజిక్కించుకోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: