కేంద్రంలో మంత్రివర్గం ఏర్పడి అయిదు నెలలవుతోంది. మంత్రులంతా ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే కేంద్ర మంత్రుల్లో కొందరు సమర్పించిన ఆస్తుల వివరాలు చూస్తుంటే మన మంత్రులు ఎంత ఎదిగిపోయారో అనిపిస్తోంది. కేంద్ర మంత్రులు ఎన్నికల సమయంలో అఫిఢవిట్ లో పేర్కొన్న ఆస్తుల వివరాలకు ఇప్పటి వివరాలకు తేడా వచ్చింది. కొందరు మంత్రుల ఆస్తులు బాగా పెరగగా.... మరికొందరివి మాత్రం తగ్గిపోయారట. ఆస్తులు భారీగా పెరిగిన మంత్రుల్లో రైల్వేమంత్రి సదానందగౌడ టాప్ లో ఉన్నారు. లోక్ సభ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయనకు రూ.9 కోట్ల 88 లక్షలు. ప్రస్తుతం పీఎంఓకు సమర్పించిన అఫిడవిట్ లో రూ.20 కోట్ల 35 లక్షలుగా చూపారు. ఈ లెక్కన రైల్వే మంత్రి ఆస్తులు ఆరు నెలల్లోనే రెట్టింపు అయినట్లు కనిపిస్తోంది. ఇక మరో మంత్రి రాధాకృష్ణన్ ఆస్తులు అఫిడవిట్ లో రూ.4 కోట్ల 9 లక్షలు చూపగా... ప్రస్తుతం ఆయన ఆస్తులు రూ.7 కోట్ల 7 లక్షలకు చేరుకున్నాయట. అయితే ఇదే కాలంలో సుమారు 16 మంది కేంద్ర మంత్రుల ఆస్తులు మాత్రంగా తగ్గాయట. ఈ జాబితాలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఐదు నెలల్లో 16 మంది కేంద్రమంత్రుల ఆస్తులు తరిగిపోయాయి. పెద్దఎత్తున్న ఆస్తులు తరిగిన మంత్రుల్లో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ది ముందువరుస. ఆమె తన అఫిడవిట్ లో రూ. 17 కోట్ల 55 లక్షలు చూపారు. ఇప్పుడు ఆమె ఆస్తులు రూ. 13 కోట్ల 64 లక్షలకు తగ్గాయట. ఇంకో మంత్రి జనరల్ వీకే సింగ్ ఆస్తులు 4 కోట్ల 11 లక్షలు ఉండగా , ఇప్పుడు రూ. 97 లక్షల 27 వేలు మాత్రమే మిగిలాయని సమాచారం. అయిదు నెలల్లోనే ఇంత భారీ స్థాయిలో మార్పులు రావడానికి కారణమేమిటో ఎవరూ చెప్పలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: