ఎపి కొత్త రాజధాని విజయవాడ,గుంటూరు.తెనాలి చుట్టూరా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో కొంత భాగాన్ని కార్ల రేసులకు వాడుకుంటే ఎలా ఉంటుందన్నదానిపై ప్రభుత్వం పరిశీలన చేస్తోందన్న సమాచారం ఆసక్తికరంగా ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు కోసం నాలుగు వేల కోట్ల తో భూమిని సేకరించవలసి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. దీనిని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఈ సందర్భంలోనే ఢిల్లీలోని బుద్ద సర్క్యూట్ పేరుతో ఉన్న ఒక రోడ్డులో ఫార్ములా ఒన్ కారు రేసులు జరుగుతున్నాయని ,అదే ప్రకారం దక్షిణాదిలో ఎక్కడా లేని విధంగా ఈ కొత్త రోడ్డు నిర్మాణంలోనే ఈ కార్ల రేసులకు వీలుగా నిర్మాణం చేస్తే టూరిస్టు ఆకర్షణ అవుతుందని భావిస్తున్నారు.ఈ ఐడియా ఏదో బాగానే ఉంది. మరి సాధ్యాసాధ్యాల సంగతి ఏమోకాని టూరిస్టులను ఆకర్షించడానికి ఇది ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: