ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనం చిన్నపోయింది. ఎన్నటికైనా తెలంగాణదే ఆఫీస్‌ అనుకుంటున్నారో.... మనది కాని హైదరాబాద్‌లోని కార్యాలయానికి వెళ్లి చేసేదేముందని భావిస్తున్నారో తెలియదు కాని... ఏపి టిడిపి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనం వైపు కన్నెత్తి చూడడం లేదు. ఏపి వారి బాటనే తెలంగాణ తమ్ముళ్లు పట్టడంతో ఎప్పుడు లీడర్లతో కళకళలాడే టిడిపి కార్యాలయం వెలవెలబోతోంది. పదేళ్ల తర్వాత ఏపిలో అధికారంలోకి వచ్చినా.. లీడర్లు రాక ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనం వెలవెలబోతోంది. అధికారానికి దూరంగా ఉన్న ఈ పదేళ్లలోను నిత్యం తెలుగుతమ్ముళ్లతో సందడిగా ఉండేది. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ ప్రత్యర్థులను ఘాటైన మాటలతో ఇరుకున పెట్టే మాటల తూటాలు పేల్చేవారు తెలుగు తమ్ముళ్లు. ఉన్నట్టుండి ఏమయిందో తెలియదు కాని లోకేష్‌ అండ్‌ టీం, లోకేష్‌ బాబుతో సమస్యలు చెప్పుకునే జనాలు తప్ప టిడిపి ఎమ్మెల్యేలు, మంత్రులే కాదు నాయకులు కూడా కార్యాలయానికి రావడం లేదు. ఏపిలో వైసీపీ, కాంగ్రెస్‌లు, తెలంగాణలో టిఆర్‌ఎస్‌ చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నాయి. గతంలో చీమచిటుక్కుమంటేనే ట్రస్ట్‌ భవనంలో టక్కున ప్రత్యక్ష్యమై ఆగమాగం చేసే టిడిపి నేతలు బాబుపై ముప్పేట మాటల దాడి జరుగుతున్నా కిమ్మనడం లేదు, కార్యాలయంవైపు కన్నెత్తి చూడడం లేదు. చివరకు మీడియా సమావేశాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ఇదేమని ఏపి ఎమ్మెల్యేలను, మంత్రులను అడిగితే రాష్ట్రం విడిపోయాక మాకు హైదరాబాద్‌తో పనేంటి అంటున్నారు. సొంత పనులేమైనా ఉంటే హైదరాబాద్‌కు వచ్చి పనులు చూసుకుని వెళ్లిపోతున్నారు. ఈ విషయంలో లోకేష్‌ చాలా సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఏపి ఎమ్మెల్యేలంటే హైదరాబాద్‌లో ఉండకుండా వచ్చి వెలుతున్నారు. ఎప్పుడు సచివాలంయంలో ఉండే ఏపి మంత్రులు సైతం పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టడం లేదు. ఒకరిద్దరు మంత్రులు లైబ్రరీకి వచ్చి కాలక్షేపం చేసి వెళ్లి పోతున్నారు. తెలంగాణ టిఆర్‌ఎస్‌ లీడర్లు, మంత్రులు తెలంగాణ భవనం నుంచే విమర్శలు చేస్తున్నా... ఏపి మంత్రులు మాత్రం తమకూ.. పార్టీ ఆఫీస్‌ ఒకటుందనే విషయం మరిచిపోయినట్టు వ్యవహరిస్తున్నారు. పరిస్థితి గమనించి ప్రతిఒక్కరు పార్టీ కార్యాలయానికి రావాలని, ఇక్కడి నుంచే మాట్లాడాలని చంద్రబాబు, లోకేష్‌లు హకుం జారీ చేసారు. అయినా మంత్రులు లైట్‌గా తీసుకున్నారు. చంద్రబాబు దీనిపై తన సైన్యానికి ఎలాంటి పాఠం చెప్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: