ఆంద్ర ప్రదేశ్ ప‌్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పధకం బ్యాంకుల చావుకు వచ్చింది. ఎపి ప్రభుత్వం కోరినట్లు రైతుల డేటాను ఇవ్వడానికిగాను ఆయా బ్యాంకులలో విద్యార్ధులను నియమించుకుంది.వారు నిర్దిష్ట పార్మాట్ ప్రకారం డేటాను కంప్యూటర్ లో ఎక్కించి ఇవ్వవలసి ఉంది. అయితే విద్యార్ధులు కొందరు తెలిసి ,తెలియక తప్పులు చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. కొందరు విద్యార్ధులు రైతుల బ్యాంకు ఖాతాల బదులు సెల్ ఫోన్ నెంబర్లు ఎక్కించారట. అలాగే బ్యాంకు బ్యాలెన్స్ లను ఖాతా నెంబరుగా ఎక్కించారట. ఈ రకంగా వందల సంఖ్యలో కాదు..లక్షల సంఖ్యలో తప్పులు జరగడంతో నాలుక కరచుకున్నారు. అంతా అయ్యాక రుణమాఫీతో అనుసందానం చేయడానికి ప్రయత్నిస్తే అదంతా మిస్ మాచ్ అయింది. అప్పుడు తనిఖీ చేస్తే ఈ విషయం బయటపడింది.సుమారు 16 లక్షల మేర ఇలా ఖాతాలలో తప్పులు దొర్లాయి.మరో పదిహేను లక్షల రుణాలకు ఆదార్ కార్డు అనుసంధానం జరగలేదు.దీంతో ఎపి ఆర్ధిక శాఖకు ఈ విషయం తెలియచేయగా,వారు ఈ నెలాఖరుకు తప్పులు సరిచేసి డేటా ఇవ్వాలని కోరారు.నిజానికి అక్టోబర్ ఇరవై ఏడు కల్లా రైతుల జాబితా ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: