భారతీయ జనతా పార్టీ సీమాంధ్రలో బలపడే యత్నాలను ముమ్మరం చేసిందని స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ లో ఇంకా మిగిలి ఉన్న నేతలను చేర్చుకొని...బలోపేతం కావాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండటం... వివిధ రాష్ట్రాల్లో అనుకూల పవనాలు వీస్తుండటం భారతీయ జనతా పార్టీకి ప్లస్ గా మారుతున్నాయి. అయితే సీమాంధ్రలో భారతీయ జనతా పార్టీకి సరైన నాయకత్వం.. సంస్థాగతమైన బలం రెండూ లేవు! అయితే ఇప్పుడు మాత్రం ఆ లోటును అధిగమించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. వలసనేతలను చేర్చుకొని... నాయకత్వ లోటును అధిగమించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో ఎవరైనా తమ దారికి వస్తారని బీజేపీ నేతలు లెక్కలేసుకొంటున్నారు. అది కూడా మోడీలాంటి పవర్ ఫుల్ పీఎం తమకు ప్లస్ అవుతాడనేది బీజేపీ నేతల లెక్క! మరి ఈ సమీకరణాలన్ని కలసి వచ్చి.. సీమాంధ్రలో భారతీయ జనతా పార్టీ బలోపేతం అయితే... అది తెలుగుదేశం పార్టీకి ముప్పుగా మారే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడు గనుక బలపడితే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో సీమాంధ్రలో డిమాండ్ చేసే స్థాయికి చేరుతుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఏదో విదంగా సర్దుకొన్న భారతీయ జనతా పార్టీ ... వచ్చే ఎన్నికల సమయానికి మాత్రం బలమైన శక్తిగా కనిపిస్తుంది. సంస్థాగతంగా పార్టీ బలపడినా బలపడకపోయినా... బీజేపీ నేతలు బయటకు మాత్రం గాంభీర్యంగా కనిపిస్తారు. ఎక్కువ సీట్లను డిమాండ్ చేస్తారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ తో పొత్తును కొనసాగించినా... సీట్లను మాత్రం భారీ సంఖ్యలోనే కోరే అవకాశం ఉంది. మొన్నటి ఎన్నికల్లో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు... మూడు ఎంపీ స్థానాలతో సర్ధిపెట్టుకొన్న బీజేపీ వచ్చే ఎన్నికల నాటిగా 40 లేదా 50 అసెంబ్లీ నియోజకవర్గాలు తమకు కేటాయించాలని తెలుగుదేశానికి స్పష్టం చేసినా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: