మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ తగిన గౌరవాన్ని ఇవ్వడానికి సిద్ధం అయ్యిందా? కిరణ్ న పార్టీలో చేర్చుకొని ఆయనను రాజ్యసభ సభ్యుడిగా చేసి... కేంద్రమంత్రి పదవిని ఇవ్వడానికి కూడా బీజేపీ సై అంటోందా? సీమాంధ్రలో బలపడటమే లక్ష్యంగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కిరణ్ కు కూడా అంత ప్రాధాన్యతను ఇవ్వడానికి రెడీ అవుతోందా?! ఎలాగైనా సీమాంధ్రలో బలం పెంచుకోవాలి.. అనేది భారతీయ జనతా పార్టీ భావన. అందుకు ఇదే అదునుగా భావిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో.. ఇప్పుడు అనేక మంది తమ పార్టీ వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందని కమలనాథులు భావిస్తున్నారు. అలా వచ్చే వారందరినీ చేర్చుకోవాలని.. తద్వారా సంస్థాగతంగా బలపడాలని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చినా తప్పులేదని బీజేపీ నేతలు లెక్కలేసుకొంటున్నారట. ఆయనకు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వడానికి కమలనాథులు రెడీ అంటున్నారు. కిరణ్ ను సీమాంధ్ర వ్యాప్తంగా చరిష్మా ఉన్న నేతగా బీజేపీ నేతలు లెక్కలేస్తున్నారు. అందుకే ఆయనకు ప్రాధాన్యతను ఇవ్వాలని భావిస్తున్నారు! అయితే కిరణ్ వచ్చి చేరినంత మాత్రానా... ఆయన అద్బుతాలు చేసేదేమీ ఉండకపోవచ్చు. అయితే పార్టీలో కొంచెం పేరున్న నేత మాత్రమే అవుతాడు. కిరణ్ ది ఎలాగూ ఫెయిల్యూర్ స్టోరీనే! సొంతంగా పార్టీ పెట్టి సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేని చరిత్ర కిరణ్ కుమార్ రెడ్డిది. అయితే బీజేపీ వాళ్లు మాత్రం ఆయనను తెచ్చి నెత్తి మీద పెట్టుకొంటాం అని అంటున్నారు. మరి ఆయనతో బీజేపీకి కలిగే ఉపయోగం ఏమిటో మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: