రాజధాని భూ సమీకరణలో ప్రభుత్వం కొత్త ట్విస్ట్‌. రాజధాని కోసం 30 వేల ఎకరాలు సమీకరించినా..మిగిలేది 3 వేల ఎకరాలే అని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. రోడ్లు, డ్రైనేజీల కోసం 15 వేల ఎకరాలు..భూములిచ్చిన రైతుల కోసం 7 వేల ఎకరాలు..భవనాలు నిర్మించనున్న ప్రైవేట్‌ కంపెనీలకు 6 వేల ఎకరాలని తెలిపింది. రైతులు భూమి ఇచ్చిన నాటి నుంచే పారితోషికం అమల్లోకి రానున్నదని సూచించింది. అంతేగాక రాజధాని నిర్మాణం కోసం..అంతర్జాతీయ కంపెనీలను ఆహ్వానించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని డిజైన్‌ పూర్తయిన వెంటనే..రైతుకు ఎకరాకు వెయ్యి గజాలు ఇవ్వనున్నట్లు సమాచారం. మొత్తం ప్రక్రియ పూర్తవడానికి ఏడాది సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో భాగంగా రేపటి నుంచి భూసమీకరణ కోసం.. మంత్రులు క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: