సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జన్మ దినోత్సవం సందర్భంగా కేంద్ర నిర్వహిస్తున్న ఏక్తా దివస్‌ వివాదాస్పదంగా మారింది. ఉక్కు మనిషిని గౌరవించడంపై అభ్యంతరం లేదు కానీ.. మాజీ ప్రధాని ఇందిరాగాంధిని అగౌరవపరుస్తున్నారంటూ కాంగ్రెస్ విమర్శలు అందకుంది.. ఇవాళ అక్టోబర్‌ 31... సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జన్మదినం. కేంద్రం ఎక్తా దివస్‌ పేరుతో ఘనంగా నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా రన్‌ ఫర్‌ యూనిటీ పేరుతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌కు ఘనంగా నివాళి అర్పించడాన్ని స్వాగతిస్తూనే.. ఇందిరాగాంధీ సేవలను విస్మరిస్తారా అంటూ కాంగ్రెస్‌ విమర్శలు దాడి చేసింది.  దేశ ప్రధానిగా ఆమే చేసిన సేవలపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఇదే రోజు ఇందిరాగాంధీ వర్ధంతి ఉన్నా.. కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎన్డీయే రాజకీయం ఇందులో బయటపడుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. సర్దార్‌ పటేల్‌ను కాంగ్రెస్‌ ఎప్పుడూ గౌరవిస్తుందని గుర్తు చేశారు. అటు బీజేపీ కూడా కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్తింది. జాతి నేతలపై కాంగ్రెస్‌కు గౌరవం ఉంటే.. సర్దార్‌ పటేల్‌ను అధికారంలో ఉన్నంతకాలం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తోంది. ఇలా రాజకీయ పార్టీల మధ్య పరస్పర విమర్శలతో అక్టోబర్‌ 31 వివాదాస్పదంగా మారింది. ఇద్దరు నేతల లెగసీ వాడుకుని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్న ప్రధాన పార్టీల తీరుపై సగటు ప్రజలు నవ్వుకుంటున్నారు ఇదేనా .ఆతి నేతలకు ఇచ్చే గౌరవం.

మరింత సమాచారం తెలుసుకోండి: