రుణవిముక్తిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇంత వర కూచేసిన కసరత్తు ఫలితంగా సుమారు 18లక్షల అనర్హత ఖాతాలు లెక్క తేలిం ది. వివిధ బ్యాంకులనుండి వ్యవసాయం నిమ్మితం రైతులు రుణాలు తీసుకున్నా రు. చంద్రబాబు నాయడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రుణ మాఫీ హామీ అమలుకు సంబంధించి నిపుణులతో ఒక కమిటీ వేశారు. రుణ మాఫీకి అర్హులైన రైతులెందరు, వారు తీసుకున్న రుణాలెన్ని, ముఖ్యమంత్రి హా మీ అమలు చేయాలంటే బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం ఎంత అన్న విషయాలపై ఈ కమిటీ కసరత్తు చేసింది. ఈ కసరత్తు ఫలితంగా 80 ల క్షల ఖాతా ద్వారా రైతులు రుణాలు తీసుకున్నట్లు తేలింది. అయితే, ఇందులో కూడా రుణమాఫీకి అర్హులైన ఖాతాలెన్ని అన్నవిషయాలు తేల్చాలి. ఎందుకంటే, రుణమాఫీకి అర్హతగా ప్రభుత్వం రైతు కుటుంబాలను పరిగణలోకి తీసుకుంది. ఒక కుటుంబంలో ఎన్ని ఖాతాలైనా ఉండవచ్చు, ఎంత అప్పుఅయినా ఉండవ చ్చు. ప్రభుత్వం గరిష్టంగా ఒక కుటుంబం, కుటుంబానికి లక్షన్నర రూపాయల మాఫీ అన్న విధానాన్ని పెట్టుకున్నది. ఒక వైపు రుణమాఫీపై కసరత్తు జరుగు తుండగానే వివిధ కారణాల వల్ల రుణమాఫీ కాస్త, రుణవిముక్తిగా మారింది. ఇందుకోసం ప్రభుత్వం రైతు సాధికార సంస్ధను ఏర్పరచటం, సంస్ధ కార్యాల యాన్ని విజయవాడకు సమీపంలోని గన్నవరంలో ఏర్పాటు చేయటం కూడా పూర్తయింది. ఈ సంస్ధకు మూలధనంగా ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలను కూడా జమచేసింది. ఒక వైపు ప్రభుత్వం ఇంత కసరత్తు చేస్తున్నా, మరోవైపు బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న రైతుల జాబితాలు మాత్రం ప్రభుత్వానికి శుక్రవారానికి కూడా అందలేదు. ఎన్ని మార్లు గడువులు పెంచినా ఉపయోగం లేకపోవటంతో బ్యాంకుల నుండి జాబితాలు అందటానికి శుక్రవారం సాయం త్రం 5 గంటలుగా ప్రభుత్వం గడువు విధించింది. అయినా, కొన్ని బ్యాంకుల నుండి కొంత సమాచారం అందాల్సిఉంది. ఇదే విషయమై రాష్ర్ట ప్రణాళికా సం ఘం వైఎస్‌ ఛైర్మన్‌ సి.కుటుంబరావు తనను కలసిన విలేకరులతో శుక్రవారం మాట్లాడుతూ, బ్యాంకుల నుండి రావాల్సిన జాబితాల్లో దాదాపు 95శాతం వచ్చే సినట్లు తెలిపారు. నవంబర్‌ 2వ తేదీనుండి తమకు వచ్చిన జాబితాలపై నివేదిక లను సిద్దం చేసుకుంటామన్నారు. నవంబర్‌ 5వ తేదీనుండి అర్హులైన జాబితాల ను రూపొందిస్తామన్నారు. మొత్తం జాబితాలను ఆన్‌లైన్‌లో ఉంచుతున్నట్లు కూడా చెప్పారు. అర్హులైన రైతుల జాబితాలను గ్రామ పంచాయితీ స్దాయిలో కూడా అందరికీ అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. బ్యాంకులు, ఎంఆ ర్‌ఓ కార్యాలయాలు, గ్రామ పంచాయితీల్లో కూడా జాబితాలను సరి చూసుకో వచ్చన్నారు.  తాము ప్రకటించిన జాబితాలపై ఏవైనా అభ్యంతరాలుంటే నవంబ ర్‌ 10వ తేదీలోగా ప్రభుత్వం దృష్టికితీసుకురావచ్చన్నారు. అవసరమైన మా ర్పులు చేర్పులు చేసిన తర్వాత ఖరారు చేసిన జాబితాలోని రైతులకు నవంబర్‌ 15వ తేదీలోగా రుణవిముక్తి ప్రక్రియ మొదలవుతుందని కుటుంబరావు వెల్ల డించారు. నవంబర్‌ 5-10వ తేదీలోగా ప్రభుత్వం దృష్టికి వచ్చే అభ్యంతరాల ను వ్యక్తిగతంగా పరిశీలించి పరిష్కారిస్తామన్నారు. ఇప్పటి వరకూ తమ వద్ద ఉ న్న జాబితాల ప్రకారం దాదాపు 18 లక్షల ఖాతాలకు ఆధార్‌ కార్డులతో అనుసం ధానం కావటంలేదన్నారు. ఒక్కో రైతు ఒకటికన్నా ఎక్కువ రుణాలు తీసుకున్న కారణంగానే ఆధార్‌కార్డుతో రుణాలు తీసుకున్నపుడు ఇచ్చినవివరాలు అనుసం ధానంకావటం లేదని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భోగస్‌వి వుండవ చ్చు లేదా ఆధార్‌కార్డును సమర్పించ లేకపోయి ఉండవచ్చన్నారు. మొ త్తం 18లక్షల ఖాతాలనూ భోగస్‌వి గా లెక్క వేయలేమన్నారు. ఏదేమైనా మరో రెండు రోజుల్లో రుణవిముక్తికి అనర్హమైన కార్డులెన్ని అన్న విషయం తేలిపోతుందన్నారు. రుణవిముక్తి ప్రక్రియ ఎక్కడి నుండి ప్రారంభమ వుతుందో ప్రభుత్వమే చెప్పాలన్నా రు. ముఖ్యమంత్రి చంద్రబాబు నా యడు ఏ ప్రాంతంలో పాల్గొంటారో కూడా ఇంకానిర్ణయం కాలేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: