ఆంధ్రప్రదేశ్‌లో ఉపా ధ్యాయపోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫి కేషన్‌ శుక్రవారం విడుదల కానుంది. గురు వారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పత్రికల వారితో మాట్లాడుతూ, ఇక నుండి ప్రతి ఏటా డిఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామన్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 9061 టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. ఈ మొత్తం పోస్టులలో 1849 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు కాగా, 812 లాంగ్వేజ్‌ పండిట్స్‌, 156 పిఇటీలు, 6244 ఎస్‌జీటీ పోస్టులు ఉంటాయని ఆయన వివరించారు. బిఇడి అభ్యర్థులకుు ఎస్‌జీటీ పోస్టులకు అర్హత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిం చలేదని, వచ్చే నోటిఫికేషన్‌ నాటికి అర్హత కల్పించ డానికి ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించి అడిగిన ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇంటర్‌ పరీక్షలు ఉమ్మడిగా నిర్వహి స్తామని, దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరిస్తుందని భావిస్తున్నామన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఆయన వివరించారు. నోటిఫికేషన్‌ ఈ నెల 21వ తేదీన జారీ అవుతుంది. పరీక్ష రుసుంను ఆన్‌లైన్‌ ద్వారా లేదా ఇ-సేవా కేంద్రాల ద్వారా డిసెంబర్‌ 2వ తేదీ నుంచి 2015 జనవరి 16వ తేదీ వరకు చెల్లించవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్‌ 3వ తేదీ నుండి ప్రారంభమై, 2015 జనవరి 17తో ముగు స్తుంది. లిఖితపూర్వక పరీక్ష (టిఆర్‌టి), 2015 మే 9, 10,11వ తేదీల్లో జరుగుతుంది. సెకండరీ గ్రేడ్‌ టీచర్ల పరీక్ష మే 9న, లాంగ్వేజ్‌ పండిట్స్‌, పిఇటిల పరీక్ష 10న, స్కూల్‌ అసిస్టెంట్స్‌ (లాంగ్వేజెస్‌, నాన్‌లాంగ్వేజ్‌) 11న జరుగుతుంది. హాల్‌టికెట్లను 2015 ఏప్రిల్‌ 25వ తేదీన డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి వుంటుంది. తొలి కీ పై అభ్యంతరాలు వుంటే 2015 మే 19 నుంచి 25వ తేదీ వరకు ఫిర్యాదులు చేయవచ్చు. తుది కీ మే 27వ తేదీన, పరీక్ష ఫలితాలు మే 28న విడుదల అవుతాయని మంత్రి గంటా వివరించారు.దరఖాస్తు ప్రొఫార్మాను, షెడ్యూల్‌, సిలబస్‌, నియమనిబంధనలు, మార్గదర్శకాలు, జిల్లా వారీ ఖాళీ పోస్టుల పరిస్థితిని వెబ్‌సైట్‌ షషష.సరవaజూ.స్త్రశీఙ.ఱఅ చూడవచ్చును.

మరింత సమాచారం తెలుసుకోండి: