సాఫ్ట్ వేర్ ఉద్యోగాలపై యువతలో ఉన్న మోజు ను కొందరు మోసగాళ్లు కాష్ చేసుకుంటున్నారు.డబ్బులు వసూలు చేసి వారిని మోసం చేస్తున్నారు.అనంతపురం జిల్లాకు చెందిన అంజాద్ పర్వేజ్ అనే వ్యక్తి 'యాహూ'లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువకుల నుంచి సుమారు ముప్పై కోట్ల మేర వసూలు చేశాడంటేనే ఆశ్చర్యంగా ఉంది.బెంగలూరులో కంపెనీని పెట్టి ఇతడు మోసం చేశాడని బాదితులు ఆరోపిస్తున్నారు. పర్వేద్ డబ్బు వసూలు చేసి దుకాణం బంద్ చేయడంతో డబ్బులు ఇచ్చినవారు లబోదిబో అంటున్నారు.బాధితులు హిందుపురం పోలీసులకు ఫిర్యాదు చేసి , తమ డబ్బు తమకు ఇప్పించాలని కోరుతున్నారు.ఎంత దురదృష్టం. ఉద్యోగాలకోసం డబ్బులు ఇవ్వడం తప్పు అని తెలిసినా ఇస్తున్నాం. ఆ సందర్భాలలో ఇలాంటి మోసగాళ్ల చేతిలో పడి దెబ్బతింటున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి: