ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోడీకి రెండే పనులుగా ఉన్నట్టున్నాయి. ఒకటి విదేశీ పర్యటన రెండు.. ఎన్నికలప్రచారం.. ప్రధానమంత్రి అయినదగ్గర నుంచి మోడీ ప్రధానంగా రెండు రకాల వార్తల్లోనే నిలుస్తున్నారు. మోడీ ప్రదానమంత్రిగా ఎన్నికయిన తర్వాత ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు వచ్చాయి. మరి అవి అలా అయ్యాయని అనుకొంటే వెంటనే మహారాష్ట్ర, హర్యానాల్లో ఎన్నికలు ముంచుకొచ్చాయి! ఆ ఎన్నికల్లో మోడీ స్టార్ క్యాంపెయినర్ గా బరిలోకి దిగాడు. పార్టీని గెలిపించడాన్ని బాధ్యతగా తీసుకొన్నాడు. మహారాష్ట్ర, హర్యానాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడే వరకూ కూడా మోడీ నిద్రపోయినట్టుగా లేడు. మరి ఆ ఎన్నికలు ముగిసిన వెంటనే మోడీ విదేశీ పర్యటనకు వెళ్లారు. జపాన్ పర్యటన ముగిసింది. ఆ తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా పర్యటనలు ముగిశాయి.. మరి ఇప్పుడు మళ్లీ వెంటనే ఆయన ఎన్నికల ప్రచారానికి రెడీ అపోయారు. ప్రస్తుతం మోడీ జార్ఖండ్ , కాశ్మీర్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించారు. ఆయా రాష్ట్రాల్లో తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిందిగా జనాలకు విజ్ఞప్తి చేస్తున్నాడు. మరి ఎన్నికలు దగ్గరపడుతున్నా.. ఇన్ని రోజులూ జార్ఖండ్ , కాశ్మీర్ లలో వాతావరణం కొంత స్తబ్దుగానే ఉండింది. అయితే మోడీ ఎంటరయ్యాకా.. అక్కడ ఎన్నికల హోరు మొదలయినట్టుగా కనిపిస్తోంది! ఇక మిగతా పక్షాల తరపున కూడా ప్రధాన నేతలు అంతా బరిలోకి దిగారు. ప్రచారం చేస్తూ తమ పార్టీ లను గెలిపించుకోవాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: