ఆదివారం రోజున జపాన్ పర్యటనకు బయలుదేరనున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తన మందీమార్బలాన్ని తీసుకొని ఆయన జపాన్ లో పర్యటించనున్నారు. ఏపీని ఎలా అభివృద్ధి చేయాలనే విషయం గురించి స్టడీ చేస్తున్న బాబు ఇప్పటికే తన బ్యాచ్ ను తీసుకెళ్లి సింగపూర్ ను చూసి వచ్చాడు. ఇప్పుడు జపాన్ ను చూసి రావడానికి వెళుతున్నారు. అక్కడ నిర్మాణాలను, నగరాలను చూసి ఇక్కడ అలాంటి అభివృద్ధి చేపట్టాలనేది బాబు తాపత్రయం. మరి సింగపూర్ , జపాన్ కబుర్లు ఎలా ఉన్నా... ఒకవైపు ఏపీలో రుణమాఫీ వంటి వ్యవహారాల గురించి రైతులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు రుణమాఫీ జరుగుతుందా?! అని వారు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో సవాలక్ష కొర్రీలు పెట్టిన ప్రభుత్వం 20 శాతం రుణాలను ఏ డాదికి మాఫీ చేస్తామని అయితే హామీ ఇచ్చింది. మరి అదెప్పుడు?! అనేదే అంతుబట్టడం లేదు! ఈ నేపథ్యంలో తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఒక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ నుంచి తిరిగి రాగానే.. 20 శాతం రుణామాఫీకి సంబంధించిన డబ్బు రైతుల ఖాతాల్లో పడుతుందని మంత్రిగారు ఒక ప్రకటన చేశారు! మరి అదే జరిగితే రైతులకు అంతో ఇంతో అన్నా ఊరట దక్కుతుందని చెప్పవచ్చు. మరి 20 శాతం రుణమాఫీకి సంబంధించిన నిధుల కేటాయింపు కూడా ఇప్పటి వరకూ జరగలేదు. వడ్డీనే 17 వేల కోట్ల రూపాయల వరకూ ఉందట. బడ్జెట్ లోనేమో 5 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. మరి బాబు తాజాగా జపాన్ నుంచి తిరిగి రావడం అనే గడువు పెట్టారు కదా! చూద్దాం ఏం జరుగుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: