భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ సా,ప్రధాని నరేంద్ర మోడీలు బిజపి సభ్యత్వం పేరుతో ఆంద్రప్రదేశ్ , తెలంగాణలలో పర్యటించనున్నారన్న వార్త ఆసక్తికరమైనదే. తెలంగాణలో అదికారంలో ఉన్న టిఆర్ఎస్ మిత్రపక్షం కాదు.కాని ఎపిలో బిజెపి కూడా తెలుగుదేశం తో పాటు అధికారంలో భాగస్వామిగా ఉంది.ఈ నేపధ్యంలో సొంతంగా ఎదగడానికి బిజెపి ప్రయత్నాలు ఆరంబించింది. స్వయంగా తాను బిజెపి అంతగా బలంగా లేని కేరళ, పశ్చిమబెంగాల్, తెలంగణ , ఆంద్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో సభ్యత్వం పేరుతో పర్యటించడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని బావిస్తున్నారు. వేరువేరుగా కాని, కలిసికాని ప్రధాని మోడీ కూడా ఎపి, తెలంగాణ లలో పర్యటించవచ్చని అంటున్నారు.అంతేకాక ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని చేర్చుకోవాలని ఎపి శాఖ అద్యక్షుడు కంభంపాటి హరిబాబుకు సూచన ఇవ్వడం ద్వారా సొంతంగా ఎదగడానికి బిజెపి ప్రయత్నాలు మొదలు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: