జమ్మూ కాశ్మీర్ ఓటర్లపై హామీల వర్షం కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. జమ్మూ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కిష్టావర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రెండు కుటుంబాల నుంచి మాత్రమే నాయకులు వస్తున్నారు. మిగతా కుటుంబాల్లో నాయకులు లేరా అని ప్రశ్నించారు. మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదని, కాశ్మీర్-ను కాశ్మీర్-గానే పరిగణించాలని తెలిపారు. ఇక్కడి ప్రజలు చర్చలతోనే అలసిపోయారని, ఇప్పుడు అభివృద్ధిని కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. తాను ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ ఇండియాకు పిలుపునిచ్చానని, అది జమ్మూ నుంచే మొదలవుతుందని మోదీ స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: