పేపర్‌ రహిత సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా జరుగుతోం దని, ఇది దేశంలోనే నూతన విధానమని టీడీపీ నేత ఇ పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నిర్వహి స్తున్న సభ్యత్వ నమోదు ప్రగతిని వివరించారు. పార్టీ స్థాపించిననాటినుంచి గత 30ఏళ్లుగా ఈ కార్య క్రమం కొనసాగిస్తున్నామన్నారు. ఏపీలో 9లక్షల క్రియాశీల సభ్యత్వాలను లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 10లక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయని ఆయన ప్రకటించారు. తెలంగాణలో 4.8లక్షల మందిని లక్ష్యంగా పెట్టుకున్నామని..అయితే ఇప్పటివరకు 2లక్షల మంది సభ్యత్వాలు పూర్తిచేశామన్నారు. రెండు రాష్ట్రాలు కలుపుకుని 12లక్షలకుపైగా క్రియాశీల సభ్యత్వాలు పూర్తయ్యాయని వెల్లడించారు. క్రియాశీల సభ్యత్వం ద్వారా ఇన్య్షూరెన్స్‌తోపాటు కొన్ని అదనపు ప్రయోజనాలు సమకూరే కారణంగా సభ్యత్వ కార్డును భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యవహరిస్తోందన్నారు. విద్యుత్‌ సమస్యలతో రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతుంటే అసెంబ్లిdలో చర్చకు అనుమతించడంలేదన్నారు. రైతులకు భరోసా కల్పించే చర్యలను వదిలి అనవసర విషయాలపై రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈసందర్భంగా కార్యకర్తలకు గుర్తింపు కారర్డ లను అందజేశారు. సమావేశంలో పి రాములు, బి శోభారాణి, లక్ష్మణ్‌నాయక్‌, బుచ్చిలింగం తదితులు పాల్లొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: