ఒకవైపు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న స్వచ్ఛభారత్ విషయంలో పెదవి విరిచాడు. ఈ పనిలో కొత్త ఏమీ లేదని... స్వచ్ఛభారత్ వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదని రాహుల్ జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించాడు. మరి రాహుల్ మాత్రమే అనుకొంటే.. ఇప్పుడు ములాయం కూడా మోడీ కార్యాచారణను తప్పుపడుతున్నాడు. సమాజ్ వాదీ పార్టీ అధినేత మరో వ్యవహారంలో మోడీ తీరును విమర్శిస్తూ మాట్లాడాడు. ఇది గ్రామాల దత్తతకు సంబంధించి. ప్రజాప్రతినిధులు అయిన ఎంపీలు ఒక్కోరు ఒక్కో గ్రామాన్ని దత్త తీసుకోవాలని మోడీ సూచిస్తున్నాడు. ప్రతి ఒక్క ఎంపీ ఒక్కో గ్రామ బాధ్యతను తీసుకోవాలని మోడీ అంటున్నారు. పార్టీలకు అతీతంగా అందరు ఎంపీలకూ మోడీ ఈ సూచన చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ములాయం స్పందిస్తూ... తను ఎప్పుడో చేసిన పనిని మోడీ ఇప్పుడు చెబుతున్నాడని అన్నాడు. ఎప్పుడో దశాబ్దాలకు పూర్వమే తాను ఇలా దత్తత కార్యక్రమాన్ని మొదలు పెట్టమని నేతలకు సూచించానని ఈ సోషలిస్టు నేత చెప్పుకొస్తున్నాడు. ఈ విధంగా చూసినప్పుడు మోడీ తనను అనుకరించినట్టేనని అభిప్రాయపడుతున్నాడు. మరి దీనిపై కమలనాథులు ఏమంటారో!

మరింత సమాచారం తెలుసుకోండి: