తమిళనాడులో ప్రస్తుతం ఒకరకమైన రాజకీయ శూన్యత ఉందని... ఈ పరిస్థితుల మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ గనుక రాజకీయాల్లోకి వచ్చినా.. సొంతంగా పార్టీ పెట్టినా అద్భుతం జరగవచ్చని.. ఆయన తమిళనాడుకు ముఖ్యమంత్రి అయిపోవచ్చని అందరూ అంటున్నారు. ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ రజనీని రాజకీయాలవైపు తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడం, డీఎంకే పరిస్థితి ఏ మాత్రం బాగోలేకపోవడంతో.. రజనీ కచ్చితంగా జనాల ఛాయిస్ అవుతాడనేది బీజేపీ ఆశ. అయితే రజనీకాంత్ మాత్రం తను రాజకీయాల్లోకి వచ్చేది ఉండదని స్పష్టం చేశాడు. మరి ఈ సంగతి ఇలా ఉంటే.. తాజాగా తమిళనాడులో ఒక సర్వే జరిగిందట. ప్రస్తుతరాజకీయ పరిణామాల గురించి జరిగిన ఆ సర్వేలో రజనీకాంత్ కన్నా మరో హీరో పార్టీ పెడితే ఎక్కువ ఆదరణ ఉంటుందని జనాలు అభిప్రాయపడ్డారట. ఆ హీరోనే విజయ్. ఒకవేళ విజయ్ గనుక పార్టీ పెడితే ప్రజల నుంచి మంచి మద్దతు ఉంటుందని ఆ సర్వే చెబుతోంది. రజనీకాంత్ పార్టీకి దాదాపు 17 శాతం మంది మద్దతు పలకగా.. విజయ్ పార్టీకి 21 శాతం మంది మద్దతు పలికారని ఆ సర్వేలో పేర్కొన్నారు. ఇక ప్రజల ఫస్ట్ ఛాయిస్ ఇప్పటికీ అమ్మేనని ఈ సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల మధ్య ఎన్నిక జరిగినా... తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో పేర్కొన్నారు. మరి ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి. ఈ సర్వే లో ప్రతిఫలించిన అభిప్రాయాలే నిజం అయితే.. అమ్మ పార్టీకి తిరుగులేదేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: