శుభం కార్డు పడిందనుకొన్న.. భారతీయ జనతా పార్టీ, శివసేన ల స్నేహం వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. తాము భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమేనని స్పష్టం చేసింది మరాఠా పార్టీ శివసేన. కేంద్రంలోనూ.. రాష్ట్రంలోనూ తాము భారతీయ జనతా పార్టీకి విపక్షంగానే ఉంటామని శివసేన స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నుంచి శివసేనకు స్నేహ ప్రతిపాదన వచ్చింది. శివసేనను తాము కలుపుకొని పోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది. శివసేనను మహారాష్ట్ర క్యాబినెట్ లోకి చేర్చుకొంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రకటించాడు. ఇటువంటి నేపథ్యంలో శివసేన, భారతీయ జనతా పార్టీలు కలిసి పోవడం ఖాయమని అందరూ అనుకొన్నారు. అయితే తమకు మాత్రం ఆ ఉద్దేశం లేదని శివసేన ప్రకటించింది. ఈ ప్రకటన ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి ఇప్పుడు గనుక శివసేన ఈ ప్రతిపాదన మీద గట్టిగా నిలబడితే.. బీజేపీకి ఇరకాటమే! ఎందుకంటే.. మహారాష్ట్రలో ఆ పార్టీ ఏర్పాటు చేసింది మైనారిటీ ప్రభుత్వమే. మరోపక్షం మద్దతు కచ్చితంగా అవసరముంది. ఇప్పటికే ఎన్సీపీ భారతీయ జనతా పార్టీపై యుద్ధాన్ని ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి తమ మద్దతు ఉండదని ఎన్సీపీ ప్రకటించింది. ఇటువంటి నేపథ్యంలోబీజేపీ ఆశలన్నీ శివసేన మీదే ఉన్నాయి. మరి శివసేన ప్రతిపక్ష స్టాండుపై ఎంత గట్టిగానిలబడుతుందో అనేదే ఇక్కడ అత్యంత ఆసక్తికరమైనది!

మరింత సమాచారం తెలుసుకోండి: