వనరుల పెంపుకోసం విశ్వయత్నం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రజలపై బారం మోపక తప్పకపోవచ్చన్న కధనాలు వస్తున్నాయి.ఎఫ్ ఆర్ బిఎమ్ చట్టం ప్రకారం కొత్త అప్పులు చేయడానికి అవకాశం లేకపోవడంతో ,దాని నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది.సుమారు పది వేల కోట్ల అదనపు అప్పుల కోసం ప్రభుత్వం కేంద్రాన్ని అనుమతి కోరింది.కాని అందుకు కేంద్రం అంగీకారం ఇంతవరకు తెలపలేదు.దీంతో సొంత వనరులు పెంచుకోవడానికి తెలంగాణ అదికారులు కసరత్తు ప్రారంభించారు. దీని ప్రకారం వాహనాల పన్నులు, వాట్ వంటివాటిని కొంత మేర పెంచాలని ఆలోచన చేస్తున్నారు.ప్రత్యేకించి నాలుగు వేల కోట్ల రూపాయల అదనపు వనరుల సమీకరణకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం వస్తోంది.పది లక్షల రూపాయల లోపు ఖరీదైన వాహనాలపై వేసే జీవిత పన్నును పన్నెండు నుంచి పద్నాలుగు శాతం చేయవచ్చని, అంతకుమించి ఖరీదైన వాహనాలకు ఒక శాతం పన్ను పెంచవచ్చని భావిస్తున్నారు.అలాగే ఆయా వస్తువులపై విధిస్తున్న పన్నులలో కూడా కొంత మార్పు చేయవచ్చని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: