అత్యంత భద్రత ఉంటుందనుకున్న అమెరికా కూడా ఆందోళనలతో అట్టుడుకుతుంది. ఈ నెల 22న న్యూయార్క్ లో 12 ఏళ్ల తమీర్ రైస్ అనే బాలుడు ఓ గ్రౌండ్ బయట బొమ్మ తుపాకీతో ఆడుకుంటూ, సరదాగా గ్రౌండ్ లోని వారికి గురిపెట్టాడు. అది నిజం అనుకుని ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి సమాచారమందించాడు. అక్కడికి వచ్చిన పోలీసులు విషయం తెలుసుకోకుండా ఆ బాలుడిని చేతులు పైకి ఎత్తమని సూచించారు. కానీ అతడు ఆ సూచనలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాడు. దీంతో పోలీసులు అతడి మీద కాల్పులు జరిపారు. ఆ బాలుడు చికిత్స పొందుతూ మరుసటి రోజు మరణించాడు.  ఈ సంఘటనపై నల్లజాతీయులంతా ఆగ్రహంతో ఊగిపోయారు. తాజాగా ఆగస్టు 9న మైఖేల్ బ్రౌన్ అనే 18 ఏళ్ల నల్లజాతీయుడిని కాల్చి చంపిన ఘటనలో ఫెర్గ్యూసన్ పోలీస్ అధికారి డారెన్ విల్సన్ తప్పులేదని అమెరికన్ గ్రాండ్ జ్యూరీ నేడు తేల్చింది. దీంతో అమెరికా అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. లాస్ ఏంజిలెస్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్, ఓక్ లాండ్, డెల్ వుడ్, కాలిఫోర్నియాల్లో ఆందోళనకారులు రెచ్చిపోయారు. వీధుల్లోకి వచ్చి పలు భవనాలకు నిప్పుపెట్టారు. పోలీస్ వాహనాలను ధ్వసం చేశారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు భాష్పవాయు ప్రయోగం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: