యువతతో పాటు పసివారిని సైతం పెడదోవ పట్టిస్తోన్న అశ్లీల వెబ్‌సైట్లపై కొరడా ఝుళిపించేందుకు తెలంగాణ సర్కారు రంగం సిద్ధం చేసింది. మహిళలపై అఘాయి త్యాలకు అశ్లీల వెబ్‌సైట్లు కూడా ఒక రకంగా కారణమవుతుం డడంతో వీటిపై వేటు వేయాలని టి.సర్కారు ఏర్పాటు చేసిన మహిళా భద్రత కమిషన్‌ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు కమిషన్‌ సభ్యులుగా వున్న సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి పూనం మాలకొండయ్య, హోంశాఖ కార్యదర్శి సౌమ్యా మిశ్రా, సిటీ అదనపు పోలీసు కమిషనర్‌ స్వాతి లక్రా, సిఐడి చీఫ్‌ చారుసిన్హా తదితరులు బుధవారం రాష్ట్ర పంచాయతీ రాజ్‌, ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావుతో భేటీ అయ్యారు.  అశ్లీ లం వెదజల్లుతున్న వెబ్‌సైట్ల పనిపట్టాలని కోరారు. అశ్లీల వెబ్‌సైట్ల వల్ల మహిళల భద్రత ఇబ్బందికరంగా మారిందని, యువత పెడదారిన పడుతుందని కమిషన్‌ సభ్యులు కెటిఆర్‌కు వివరిం చారు. అశ్లీల వెబ్‌సైట్లపై నిషేధం కొంత కష్టమే అయినా, చిత్తశుద్దితో వ్యవహరిస్తే అసాధ్యమేమి కాదని వారు వివరిం చారు. అశ్లీల వెబ్‌సైట్లపై నిషేధం తరువాత వీటిని కొనసాగించే వారిపై చర్యలు తీసుకోవాలని, ఇంటర్‌నెట్‌ సెంటర్లపై నిరంతరం నిఘా వుంచాలని కమిషన్‌ సభ్యులు మంత్రిని కోరారు. ఓ వైపు కమిషన్‌ సభ్యులు మంత్రి కెటిఆర్‌తో భేటీ అయిన తరుణం లోనే పోలీసు విభాగం అశ్లీల వెబ్‌సైట్లపై ఆరా తీయసాగింది.  అశ్లీల వెబ్‌సైట్ల వినియోగం ఎక్కువగా జంట నగరాలు, శివారు ప్రాంతాలలోనే ఎక్కువగా వుందని, వీటిపై నిషేధం కోసం ఇంటర్‌నెట్‌ ప్రధాన అనుసంధనదారులతో మాట్లాడేందుకు పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇదే సమయంలో ఇంటర్‌నెట్‌ కేంద్రాలపై నిఘా వుంచాలని నిర్ణయించారు. జంట నగరాలు, శివారు ప్రాంతాలలో మొద ట అశ్లీల వెబ్‌సైట్లపై నిషేధం అమలుచేశాక తెలంగాణ వ్యాప్తంగా దీనిని అమలు చేయాలని వారు నిర్ణయించారు. ఈ విషయంలో అవసరమైతే కేంద్రం సహకారం తీసుకోవాలని వారు నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: