తెలంగాణలో అధికారపార్టీ మైండ్‌గేమ్‌ ఆడుతోంది. ఈ మైండ్‌ గేమ్‌ దెబ్బకి తెలంగాణలోని ఇతర ప్రధాన రాజకీయపార్టీలో కాంగ్రెస్‌,టిడిపీ కుదేలవుతున్నాయి. విపక్షాలన్ని ఒక్కతాటిపై వుంటేనే, అధికారపార్టీని, ఏవిషయంలో అయినా ఇరకాటం పెట్టగలవు. కానీ విపక్షాల ఐక్యతాలోపాలను గుర్తించిన టిఆర్‌ఎస్‌ పార్టీ విపక్షాలను నిర్వీర్వం చేయడం ద్వారా తమ పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం అనే మైండ్‌ గేమ్‌ కు తెరతీసింది. ఈ మైండ్‌ గేమ్‌ను ఎవరు అధికారంలో ఉన్న వినియోగిం చడం ఆనవాయితీగా మారింది. గడిచిన పదేళ్లు ఇదే వ్యూహాలను ఆయా రాజకీ యపా ర్టీలు వంటబట్టించుకున్నాయి. తాజాగా అధికారపార్టీగా ఉన్న టిఆర్‌ఎస్‌ ప్రభు త్వం అసెంబ్లీలో ఇదే వ్యూహాన్ని అమలు చేసి సక్సెన్‌ను సాధించింది. శంషాబాద్‌ విమానాశ్రయానికి డొమెస్టిక్‌ టెర్శినల్‌ కు సర్గీయ ఎన్‌టిఆర్‌ పేరు పెడుతూ కేంద్ర నిర్ణయం తీసుకోవడాన్ని, అసెంబ్లీలో టిఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా సవాల్‌ చేసింది. ఈ ఎపిసోడ్‌లో కాంగ్రెస్‌పార్టీ, తెలంగాణ అసెంబ్లీలో టిఆర్‌ఎస్‌కు అం డగా నిలిచింది. అలా విపక్షంలో చీలిక పుట్టుకొచ్చింది. ఈవిషయంలో కాంగ్రెస్‌ పార్టీ తమ స్వార్ధ రాజకీయం కోసం టిఆర్‌ఎస్‌కు మిత్రపక్షంగా వ్యవహారించి అసెంబ్లీలో వ్యతిరేక తీర్మానం చేయించింది. ఈ వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా టిడిపి, బిజెపిలను ప్రభుత్వం దెబ్బతీసింది. తాజా మాజీ మంత్రి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడ పొన్నాల లక్ష్మయ్య అక్రమ భూముల్ని సొంతం చేసుకున్నారనే వివాదానికి సంబంధించి బుధవారం అసెంబ్లీలో లేవనెత్తింది. భూమల వ్యవహారం అసెంబ్లీని కుదిపేసింది. బిఎస్‌పి తరుపున ఎన్నికైన ఇంద్రకరణ్‌రెడ్డి ప్రశ్నను లేవనెత్తించి వ్యహాత్మంగా పొన్నాలను సర్కారు టార్గెట్‌ చేసింది. ఇదే అదునుగా భావించిన టిడిపి తాము గతంలోనే ఈవ్యవహారంపై పోరాటం చేశామని, సర్కారు ప్రకటించిన సభా సంఘానికి మద్దతు ప్రకటిం చింది. అంశాల వారీగా మద్దతు అనేది రాజకీయాల్లో సర్వసాధారణమే అయి నా ఆఅంశాల్ని ఎంచుకోవడంలోనే అధికారపార్టీల చాణక్యం బయటపడుతుం ది.  ఆఅంశాల పేరు చెప్పి, విపక్షాల్లో చీలిక పట్టుకొస్తే అది అధికారపార్టీ లాహిం చే అంశమేకదా. కేంద్రపరిధిలోని అంశం ఎయిర్‌పోర్టు మార్చడం.దానిపై అసెంబ్లీలో రగడ జరగడం అనేది కేవలం విపక్షంలో వున్న కాంగ్రెస్‌, టిడిపిల మధ్య చీలిక తీసుకురావడానికే అన్న వాదన బలంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌,టిడిపి ఇప్పుడు ఎవరిదారి వారిదే అన్నట్లు వ్యవహరించక తప్పని పరిస్ధితి ఏర్పడింది. రైతలు ఆత్మహత్యల విషయం మీదా, కాంగ్రెస్‌, టిడిపి ఒక్కటై, అధికార పార్టీని నిలదీసేసరికి అధికా రంలో వున్న టిఆర్‌ఎస్‌ నీళ్లు నమలాల్సి వచ్చింది. నాలుగు రోజుల క్రితం డిఎ ్‌ఎఫ్‌ భూమల వ్యవహారంలోను టిడిపి, కాంగ్రెస్‌ రెండు సర్కారు తీరును ఎండగ ట్టాయి. దీంతో ఖంగుతున్న అధికారపక్షం ప్రతిపక్షాల్లో చీలిక తీసుకురావ డంలో విజయంసాధించింది. విపక్షాల్లో వచ్చిన చీలికతో అధికార పార్టీ చివరి రెండు రోజుల మరింత దూకుడు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: