లోక్ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ రెడ్డి ప్రసంగం ఆసక్తికరంగా ఉంది. సీబీఐ గురించి చర్చ సందర్భంలో ఆయన జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చాడు. తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని సీబీఐ ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ప్రస్తావించాడు. సుప్రీం కోర్టు తీర్పులను, వివిధ సందర్భాల్లో సీబీఐ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ... సీబీఐ పూర్తిగా అధికార పార్టీ నియంత్రణలో ఉంటోందన్న విషయాన్ని మిథున్ రెడ్డి ప్రస్తావించాడు. మొన్నటి వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కనుసన్నల్లో పనిచేసిన సీబీఐ జగన్ పై కక్ష సాధించపు చర్యలకు దిగిందని మిథున్ అన్నాడు. ఇదే సమయంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుపై విచారణ జరపమని కోరితే.. తమకు సిబ్బంది లేరని సీబీఐ చెప్పడాన్ని కూడా మిథున్ రెడ్డి ప్రస్తావించాడు. ఓవరాల్ గా జగన్ కేసులో సీబీఐ తీరును లోక్ సభలో ఎండగట్టాడు మిథున్ రెడ్డి. మరి లోక్ సభలో ప్రాతినిధ్యాన్ని సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా తమ వాయిస్ ను వినిపించడానికి అవకాశం దొరికిందని చెప్పవచ్చ. ఇంతకు ముందు అయితే వైకాపాకు సభలో ఉన్నది ఒకే ఒక ఎంపీ. జగన్ ను అరెస్టు చేసి జైల్లో ఉంచినా.. దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడగలిగే వాళ్లు ఎవరూ లేకుండా పోయారు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలోనైనా.. లోక్ సభలోనైనా.. వైకాపాకు వాయిస్ ఉంది. తాము చెప్పదలుచుకొన్నదాన్ని గట్టిగా చెప్పడానికి అవకాశం ఉంది. మరి ఎన్నికల్లో అధికారాన్ని సాధించలేకపోయినా... ఈ విధంగా సభ్యులను సాధించుకోవడం అనేది... వైకాపా అధినేతకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు!

మరింత సమాచారం తెలుసుకోండి: